చెట్టు కూలి నలుగురి మృతి, ఐదుగురికి గాయాలు | Four killed, five hurt in Mumbai tree collapse | Sakshi
Sakshi News home page

చెట్టు కూలి నలుగురి మృతి, ఐదుగురికి గాయాలు

Published Mon, Jul 27 2015 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

Four killed, five hurt in Mumbai tree collapse

ముంబై: చెట్టు కూలి ఇంటిగోడపై పడటంతో నలుగురు మృతిచెందిన ఘటన ముంబైలోని శాంటాకర్జ్, వకోలా ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. శాంటీస్ ఇంటి గోడను పగలకొడుతుండగా చెట్టు ఒక్కసారిగా కూలి పడింది. ఆ సమయంలో పనిచేస్తున్న వారిపై  చెట్టు విరిగి పడటంతో నలుగురు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని మున్సిపల్ ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఈ ప్రాంతంలో గత వారం నుంచి తరుచుగా వర్షాలు పడుతున్నాయని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement