భోపాల్ : అది చాలా రద్దీగా ఉండే ఓ హైవే… కానీ, అనుకోకుండా దాని మీదకు …ఓ చిన్న విమానం ప్రవేశించింది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఆ రోడ్డుపైనే విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో మంగళవారం జరిగింది. విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం కారణంగా నాలుగు సీటర్ల ప్రైవేట్ విమానం మంగళవారం భోపాల్కు 200కిలోమీటర్ల దూరంలోని బెతుల్ ప్రాంతంలో ల్యాండ్ అయింది.
ఎన్నారై వ్యాపారి శ్యాం వర్మకు చెందిన ఈ విమానాన్ని బెతుల్-నాగపూర్ జాతీయ రహదారిపై పైలట్ అత్యవసరంగా దించేశాడు. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలిపాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మార్గంలో వెళ్లే వాహనాలను అరగంటపాటు నిలిపివేసి విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. అప్పటివరకూ విమానం గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది.
రోడ్డుపై దిగిన విమానం
Published Tue, Dec 31 2013 3:37 PM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement