Plain
-
పిలవని పెళ్లిళ్లకు.. పోలీసులు రెడీ..
పాత తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ చివర్లో డిష్యూం డిష్యూం ఫైటింగ్‌లు అయిపోయాక పోలీసులు వచ్చి శుభం కార్డు పడటం అందరం చూసే ఉంటాం. ఆగ్రా పోలీసులు మాత్రం పెళ్లిళ్లలో చిట్టచివర్లో కాకుండా ముందే వస్తారు. అదీ కూడా పిలవకుండానే వచ్చి పెళ్లిలో అత్యంత కీలకమైన, విలువైన వధువు నగలు, పెళ్లివారి నగదు వంటి వాటిపై నిఘా పెడతారు. ఎందుకంటే వాటిని కొట్టేసేందుకు చోరశిఖామణులు పెళ్లి మండపాల్లో తచ్చాడుతారని పోలీసులుకు బాగా తెలుసు. అందుకే మఫ్టీల్లో వచి్చమరీ పటిష్ట భద్రత కల్పిస్తారు. ఇదంతా ఉచితమే. ఇలా అదనపు మొహరింపు వెనక ఒక పెద్దకారణమే ఉంది. ఈ వివరాలను ఆగ్రా సిటీ డెప్యూటీ పోలీస్ కమిషనర్ సూరజ్ రాయ్ వెల్లడించారు. టీనేజర్లూ డేంజరే ‘‘రాత్రిళ్లు దొంగలు పడటం సర్వసాధారణం. పట్టపగలు పెళ్లి పందిళ్లు, మండపాల్లో దొంగలు చేతవాటం చూపించడం ఈమధ్య మరీఎక్కువైంది. ముఖ్యంగా పెళ్లి నగలు, నగదుపై కన్నేసి కొట్టేసిన ఘటనలు చాలా జరిగాయి. అందుకే పోలీసు సిబ్బందిని సాధారణ దుస్తుల్లో వివాహవేడుకలకు బందోబస్తుగా మేమే పంపిస్తున్నాం. బంధువుల్లా కలిసిపోయి అందరిపైనా ఓ కన్నేస్తాం. వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ముఖ్యంగా గమనిస్తాం. ఎందుకంటే వాళ్ల దగ్గర ఉండే నగలు, నగదునే దొంగలు కొట్టేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల సాయంతోనూ నిఘా కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగ్రా జిల్లాలోని ప్రతి కీలకమైన వేడుకకు మేం పిలవకున్నా వెళ్తున్నాం. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను గమనిస్తాం. కొన్ని సార్లు ఆ అనుమానాస్పద వ్యక్తుల వెంట వచ్చే టీనేజర్లనూ ఓ కంట కనిపెడతాం. ఎందుకంటే ఆ మధ్య ఒక పెళ్లిలో టీనేజీ పిల్లాడే కోట్లవిలువైన చోరీకి పాల్పడ్డాడు. పెళ్లిమంటపాలు, బాంకెట్ హాళ్లు, వివాహ వేదికలు ఇలా మొత్తం 18 క్లస్టర్లకు పోలీసులను పంపుతున్నాం. స్థానికులు సైతం తమ పెళ్లికి నిఘా కావాలంటే ముందస్తుగా సమీప పోలీస్‌స్టేషన్‌ను సంప్రదిస్తే ప్రతి పెళ్లికి కుదిరితే బందోబస్తును ఏర్పాటుచేస్తాం’’అని ఆయన వివరించారు. – ఆగ్రా -
ప్లెయిన్ పోజ్
పైనొక ప్లెయిన్ కుర్తీ... కిందొక ప్లెయిన్ పలాజో... ఇగ జూస్కో పోజు! ఎంత ప్లెయిన్ అయినా నథింగ్ సో సో... ప్లెయిన్ విత్ పలాజో!! స్లీవ్‌లెస్ షార్ట్ ప్లెయిన్ కుర్తీకి బాటమ్‌గా కాంట్రాస్ట్ పలాజో ధరిస్తే కంఫర్ట్ ఫీల్‌నిస్తుంది. అంతేకాదు, సూపర్ స్టైలిష్‌గా ఆకట్టుకుంటారు. రెడ్ అండ్ వైట్ ప్లెయిన్ కాంబినేషన్. వెస్ట్రన్పార్టీలో వెరైటీ లుక్. నలుపు రంగు లాంగ్ స్లీవ్స్ కుర్తీ, ముదురు ఎరుపు పలాజో నేటి వనితలకు నప్పే సరైన డిజైనర్ వేర్. మిడ్ స్లీవ్స్ షార్ట్ కుర్తీకి కాటన్ పలాజో హుందాతనాన్ని పెంచుతుంది. ట్రెడిషనల్ లుక్‌తోనే మోడ్రన్‌గా ఆకట్టుకోవాలనుకునే వారికి సరైన ఎంపిక. లాంగ్ గ్రే కలర్ కుర్తాకి నలుపురంగు పలాజో క్యాజువల్ అండ్ కంఫర్ట్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంది. షర్ట్ టైప్ ప్లెయిన్ లాంగ్ కుర్తీకి వైట్ పలాజో సింపుల్‌గా అనిపించే గ్రేట్ కాంబినేషన్. క్యాజువల్ వేర్లో అతివలను అమితంగా ఆకట్టుకుంటున్న స్టైల్ ఇది. మస్టర్డ్ ఎల్లో లాంగ్ స్లీవ్‌లెస్ కుర్తీ టాప్, రాణీ పింక్ పలాజో సంప్రదాయ వేడుకలకు స్టైలిష్ మెరుగులు అద్దుతుంది. -
అవగాహన రాహిత్యంతోనే ముంపు
రామగుండం: ఉమ్మడి ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి నిల్వలపై అవగాహన రాహిత్యంతోనే బ్యాక్‌వాటర్‌లో అధికారులు పేర్కొన్న వాటికంటే ఎక్కువ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలంలోని పొట్యాలలో రూ.60 లక్షలతో మర్రిపల్లి–పొట్యాల వరకు డబుల్‌రోడ్డు, రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్‌ను ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రసుత్తం ప్రాజెక్టు నీటి సామర్థ్యం కంటే తక్కువగానే వరద నీరు నిలిచినా కుక్కలగూడూర్ వరదతో ముంచెత్తుతుందన్నారు. మరో రెండు మీటర్ల ఎత్తు పెరిగితే మరింత ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ మూడు గ్రామాలకు ఒక్క కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. అంతర్గాం మత్స్య పరిశ్రమకు అనుకూలం – ఆర్టీసీ చైర్మన్ రివర్స్ పంపింగ్ విధానంతో నిర్మించే మేడిగడ్డ ప్రాజెక్టుతో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో గోదావరినది తీరప్రాంతం నిత్యం వరద నీటితో ఉంటుందన్నారు. గోదావరి తీరప్రాంతమైన అంతర్గాంలోని ప్రభుత్వ స్థలాల్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐలకు అనుబంధంగా మినీ పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ మస్కం శ్రీనివాస్, ఎంపీపీ ఆడెపు రాజేశం, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీటీసీ లగిశెట్టి సునీత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. -
మునుగూరు!
lకట్టువాగుకు రివిట్మెంట్ లేక అవస్థలు lఆక్రమణలకు గురవుతున్న కాలువలు lపూడికతీత ఊసెత్తని ‘సింగరేణి’ lనరకయాతన పడుతున్న కాలనీవాసులు రివిట్మెంట్ లేని కట్టువాగు.. ఆక్రమణలకు గురవుతున్న వాగులు, కాల్వలు.. కుచించుకుపోతున్న కాల్వల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం.. ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు.. వర్షం వచ్చిందంటే మణుగూరు ప్రజల పరిస్థితి కక్కలేక.. మింగలేకుండా ఉంది. వర్షాకాలం ఎక్కువ భాగం కాలనీలు ముంపునకు గురవుతుండడంతో నరకయాతన పడాల్సి వస్తోంది. – మణుగూరు మణుగూరు: మణుగూరు ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల పట్టణం దాదాపు 90 శాతం జలమయం అయింది. పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న కట్టువాగు, ఆంధ్రా బ్యాంకు సమీపం నుంచి ప్రవహించే సింగారం అలుగు కాలువ పలుచోట్ల అక్రమణలకు గురికావడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు అంటున్నారు. దాదాపు 90 శాతం వీధులు జలమయం కావడంతోపాటు కొత్తగూడెం–ఏటూరునాగారం ప్రధాన రహదారిపైకి సైతం వరద నీరు చేరడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సుందరయ్య నగర్, శ్రీశ్రీనగర్, గాంధీ నగర్, ఆదర్శ నగర్, మేదరబస్తీ, లెనిన్ నగర్, కాళీమాత ఏరియా, చేపల మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాలు వరద నీటితో నిండిపోయి.. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పలసింగారం నుంచి వచ్చే సింగారం అలుగు కాలువ అనేక చోట్ల ఆక్రమణలకు గురికావడంతో వర్షం వచ్చినప్పుడు కాలువ పొంగి.. వరద నీరు వీధులు, ఇళ్లలోకి వస్తోంది. అలాగే స్టేట్‌బ్యాంక్ పక్క నుంచి ప్రవహించే కట్టువాగు నీరు గతంలో మణుగూరు చెరువులోకి సాఫీగా వెళ్లేది. దీని పైభాగంలో ఆక్రమణలు, కిందిభాగంలో భారీగా పూడిక పేరుకుపోవడంతో వర్షం వచ్చినప్పుడు పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. కాలువల ఆక్రమణల వల్ల రివిట్మెంట్ కట్టే విషయం మరుగున పడుతోంది. ఇక పూడిక తీయకపోవడంతో మణుగూరు చెరువు అనుకున్న సమయానికి నిండే పరిస్థితి లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. పూడిక తీతకు సహకరిస్తామని ఎమ్మెల్యేకు చెప్పిన సింగరేణి అధికారులు సైతం ముఖం చాటేయడం గమనార్హం. దీంతో సింగరేణి సహకారం అంతంతమాత్రమే అన్నట్లుగా ఉంది. పైభాగంలో ఆక్రమణలు, కిందిభాగంలో పూడిక తీయకపోవడంతో వరద నీరు నేరుగా వీధులు, ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. దీంతో కొన్ని రోజులపాటు పట్టణంలో మురుగు పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చినప్పటి నుంచి వర్షాలు తగ్గేవరకు పట్టణ ప్రజలు భయంభయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ముంపు ఒకరిది..మేలొకరికి!
అచ్చంపేట : ముంపు ఒకరికైతే.. మరొకరికి మేలు జరుగనుంది. ఓ ప్రాంత రైతులు నష్టపోతే మరోప్రాంత రైతులకు లబ్ధి చే కూరనుంది. మహబూబ్‌నగర్, నల్లగొం డ జిల్లాల మధ్య డిండి ఎత్తిపోతల పథకం విషయంలో ఇదే జరుగుతుంది. ఎస్ఎల్బీసీ, మిండ్ డిండి ఎత్తిపోతలతో పా టు జూరాల- పాకాల ప్రాజెక్టు చేపట్టడం ద్వారా డిండికి నీళ్లను తీసుకొచ్చే ప్రతిపాదనలు జరుగుతున్నాయి. కృష్ణానది మిగులు జలాల ద్వారా ఎస్ఎల్బీసీ, డిం డి ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాట ర్ నుంచి 25 టీఎంసీల నీటిని నల్లగొండ జిల్లాకు తీసుకెళ్లి ఆరులక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. నక్కలగండి, లోయర్డిండి, మిడ్డిండిల కొత్త రిజర్వాయర్లతో పాటు పాత అప్పర్డిండి ప్రాజెక్టు ఆధునికీకరణ వల్ల అచ్చంపేట నియోజకవర్గంలోని 11గ్రామాలు, సుమారు 10వేల ఎకరాలు నీటిముంపునకు గురవుతున్నాయి. భూములు కోల్పోయేది తామైతే.. నీళ్లు పొందేది వాళ్లా? అని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలోనే డిండి ఎత్తిపోతల తెరపైకి వచ్చింది. డిండి రిజర్వాయర్ ఎత్తు పెంపుపై ఇప్పటికే అచ్చంపేట ఎమ్మెలే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు వేర్వేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. నష్టం మనది.. ఫలితం వారిదా? ఎస్ఎల్బీసీ టన్నెల్-1 అవుట్లెట్ నుంచి నక్కలగండి వద్ద 7.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో లోయర్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీంతో అచ్చంపేట మండలం మర్లపాడుతండా, పాత్యతండా, కేశ్యతండా, జోగ్యతండా, మన్నెవారిపల్లి, సిద్ధాపూర్, దేవులతండాలకు చెందిన 2755 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయి. టన్నెల్ మట్టి డంప్‌యార్డు కోసం 450 ఎకరాల భూమిని ఇప్పటికే ఈ ప్రాంతవాసులు కోల్పోయారు. లోయర్ డిండికి 6కి.మీ వెనుక 11 టీఎంసీల నిల్వసామర్థ్యం గల మిడ్ డిండి రిజర్వాయర్‌ను సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్నారు. ఇది జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కంటే పెద్దది. దీనివల్ల సిద్ధాపూర్, అనుబంధ తండాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఇందులో 3వేల ఎకరాల భూములు కోల్పోనున్నారు. కొత్తగా నిర్మించే మిడ్ డిండి రిజర్వాయర్‌కు 16కి.మీ దూరం వెనుకభాగంలో అప్పర్ పాతడిండి ప్రాజెక్టు ఉంది. మిడ్‌డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఒక భారీలిఫ్ట్ను నిర్మించి పాతడిండికి నీరందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పాతడిండి ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.6టీఎంసీలు కాగా, ఐదు మీటర్ల ఎత్తు పెంచి ఆధునికీకరించి 7.6 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదించారు. దీనివల్ల వంగూరు మండలం గాజర, డిండి చింతపల్లి, నిజామాబాద్, చాకలి గుడిసెలు, ఉప్పునుంతల మండలం కొరటికల్లు గ్రామాలతో పాటు 3500 ఎకరాల భూములు మునిగిపోనున్నాయి. ప్రతిపాదనలు ఇలా.. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌కు లింక్ కలపడానికి శ్రీశైలం అప్పర్‌ప్లాట్ గుట్టల్లో భూగర్భ టన్నెల్, రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం జలయజ్జంలో రూ.2813కోట్లు కేటాయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.5 కి.మీ మేర సొరంగమార్గం తవ్వాల్సి ఉంది. ఇప్పటికీ కేవలం 23.7కి.మీ మాత్రమే పూర్తయింది. కాగా, దీనికి అనుసంధానంగా రూ.5700 కోట్ల వ్యయంతో డిండి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. పాత డిండి ప్రాజెక్టును ఆధునికీకరించి నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లోని మరో మూడులక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు సర్వేలు ముగిశాయి. ప్రస్తుతం పాత డిండి ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.6టీఎంసీ కాగా, ఐదు మీటర్లు ఎత్తు పెంచి 7.6 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదించారు. పాలమూరు జిల్లా పరిధి అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, ఉప్పునుంతల మండలాల్లో 17వేల ఎకరాలు, కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల, ఇర్విన్ మండలాల్లో 10వేల ఎకరాలు, అమ్రాబాద్ ఎత్తిపోతల ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరందుతుందని చెబుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ఇదే నియోజకవర్గంలోని 20వేల ఎకరాలు ముంపునకు గురవుతున్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. -
ముంపుగ్రామాలకు వరద తాకిడి
బెల్లంకొండ పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాలకు నీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. నెల రోజుల నుంచి పులిచింతల ప్రాజెక్టు పరిధిలో నీరు నిల్వ ఉండడంతో ముంపు గ్రామాలైన పులిచింతల, కోళ్లూరు, గొల్లపేట, చిట్యాల, చిట్యాలతండా, బోదనం, గోపాలపురం, కామేపల్లి గ్రామాలు నీటి దిగ్బంధనంలోనే ఉన్నాయి. మూడు రోజుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరడం, అధిక వర్షాలు కురవడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ముంపు గ్రామాల్లోకి పది అడుగుల మేర నీటిప్రవాహం పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. నాలు గు రోజుల నుంచి అధికారుల సూచనల మేరకు కొన్ని కుటుంబాలు పునరావాస కేం ద్రాలకు వెళ్లగా మరికొంతమంది నిర్వాసితులు ముంపు గ్రామాల్లోనే ఉంటున్నారు. ముంపు గ్రామాల్లో భారీగా పంట నష్టం ముంపు గ్రామాల్లో సాగుచేస్తున్న పంటలు నీట మునిగాయి. దాదాపు 25 వేల ఎకరాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో నిర్వాసితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నీటి మునకకు గురికాని పంటల్లో తీసిన పత్తిని ఇళ్లకు తెచ్చేందుకు రాకపోకలు నిలిచిపోవడంతో పంటలంతా వర్షం దెబ్బకు తడిచిపోయాయని వారు వాపోతున్నారు. సహాయ చర్యలు చేపట్టిన రెవెన్యూ అధికారులు.. రాకపోకలు నిలిచిపోవడంతో కోళ్లూరు, గొల్లపేట గ్రామాల్లో నివాసం ఉంటున్న నిర్వాసితులను పడవల ద్వారా రెవెన్యూ అధికారులు గొల్లపేట సమీపంలో ఉన్న గద్దలగోడు వరకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లలో వెంకటాయపాలెం వరకు తీసుకువస్తున్నారు. ఆదివారం నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో స్థానిక రెవెన్యూ అధికారి లక్ష్మీప్రసాద్, ఎస్ఐ మురళీమున్నా, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది ముంపు గ్రామాలకు వెళ్లి స్థానిక పరిస్థితులను సమీక్షించి ముంపు గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు వచ్చిన నిర్వాసితులకు ఆహారాన్ని సరఫరా చేశారు. -
పునరావాస కార్యక్రమాలు వేగవంతం
కొరిటెపాడు(గుంటూరు) పులిచింతల ప్రాజెక్టు ముంపునకు గురయ్యే గ్రామాలలో సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఆర్సీ సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలలో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. పులిచింతల ప్రాజెక్ట్‌లో నీరు నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని జేసీ సూచించారు. చౌటపాపాయపాలెంలో తాగునీటి సమస్య ఉందని, అక్కడే ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అదనంగా బోర్లు కావాలంటే వేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. వీధిదీపాల నిర్వహణ సక్రమంగా చేట్టాలని, అవసరమైన శ్మశాన స్థలాలను గుర్తించాలని సూచించారు. కరాలపాడు ఒకటి నుంచి 11 అప్రౌచ్ రోడ్డుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. ప్రత్యేక కలెక్టర్, మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దార్లు, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీ కార్యదర్శులు పునరావాస కేంద్రాలను పర్యవేక్షించి, అక్కడ చేపట్టవలసిని పనులను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సహాయ పునరవాస కేంద్రాల లే అవుట్లను ఆయన పరిశీలించారు. కొండమోడు, రెడ్డిగూడెం, రాజుపాలెం, మాచాయపాలెంలలో ఉన్న సమస్యలను అడిగి తెల్సుకున్నారు. బెల్లంకొండ, రాజుపాలెం పునరావాస కేంద్రాల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని, అర్హత కల్గినవారికి బ్యాంకర్ల ద్వారా రుణాలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మాచవరం, దాచేపల్లి, బెల్లంకొండ, రాజుపాలెం, ఆర్అండ్ఆర్ కేంద్రాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గుర్తించిన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేసి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అలసత్వం చూపినట్లైతే సహించేదిలేదని హెచ్చరించారు. ఏఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరికీ జీవనస్థితిగతులు మెరుగుపరిచేలా సహాయ సహకారాలు అందించాలన్నారు. కేంద్రాల్లో రోడ్లు, పాఠశాల, అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల భవన నిర్మాణాలు, ఎలక్ట్రిక్ పోల్స్, సర్వీసు మీటర్లు, ఉపాధి కల్పన, దేవాలయాలు, పాఠశాలల తరలింపు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డ్వామా ప్రాజెక్ట్ డెరైక్టర్ ఢిల్లీరావు, గురజాల ఆర్డీవో మురళి, జిల్లా పంచాయతీ అధికారి గ్లోరియా, డీఈవో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుపై దిగిన విమానం
భోపాల్ : అది చాలా రద్దీగా ఉండే ఓ హైవే… కానీ, అనుకోకుండా దాని మీదకు …ఓ చిన్న విమానం ప్రవేశించింది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఆ రోడ్డుపైనే విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో మంగళవారం జరిగింది. విమానం ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా నాలుగు సీటర్ల ప్రైవేట్ విమానం మంగళవారం భోపాల్‌కు 200కిలోమీటర్ల దూరంలోని బెతుల్ ప్రాంతంలో ల్యాండ్ అయింది. ఎన్నారై వ్యాపారి శ్యాం వర్మకు చెందిన ఈ విమానాన్ని బెతుల్-నాగపూర్ జాతీయ రహదారిపై పైలట్ అత్యవసరంగా దించేశాడు. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలిపాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మార్గంలో వెళ్లే వాహనాలను అరగంటపాటు నిలిపివేసి విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. అప్పటివరకూ విమానం గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. -
ముంపు బాధితులను ఆదుకుంటాం
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో తుపాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటామని రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫై-లీన్ తుపాను, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన ఆర్ అండ్ బీ రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ముంపు బాధితులకు బియ్యం, కిరోసిన్, దుస్తులు, వంట సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. వర్షాల వల్ల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవారికి రూ.70 వేలతో పూర్తి సబ్బిడీపై గృహాలు మంజూరు చేస్తామన్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మరమ్మతు పనులపై ఈ నెల 12న నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మంత్రుల కమిటీకి వ్యతిరేకం రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల కమిటీకి వ్యతిరేకమని మంత్రి తెలిపారు. శ్రీ కృష్ణ కమిటీ, అంటోని కమిటీల నివేదికలను బుట్టదాఖలు చేసినట్లే ఈ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేస్తారని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులు ఈ కమిటీకి అభిప్రాయాలు చెప్పకూడదని తీర్మానించామని తెలిపారు.రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ మోరంపూడి వద్ద ప్రమాదాలు నివారణకు, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రాజమండ్రి సీతానగరం, పురుషోత్తపట్నం ఆర్ అండ్ బీ రోడ్లు మరమతుల పనులు చేపట్టాలని మంత్రిని కోరారు.