ఆకతాయికి అమ్మాయి చెప్పుదెబ్బ | Girl beats molester with slipper | Sakshi
Sakshi News home page

ఆకతాయికి అమ్మాయి చెప్పుదెబ్బ

Published Thu, Sep 15 2016 8:00 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

ఆకతాయికి అమ్మాయి చెప్పుదెబ్బ

ఆకతాయికి అమ్మాయి చెప్పుదెబ్బ

బరేలి: ఉత్తరప్రదేశ్లో మహిళలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. దుండగుల దాడిలో ఎందరో మహిళలు బలవుతున్నారు. కాగా కొంతమంది అమ్మాయిలు తమను వేధించినవారిని తగినబుద్ధి చెప్పి, ఇతరుల్లో ధైర్యం కలిగిస్తున్నారు. ఓ అమ్మాయి ఆకతాయిపై తిరగబడి తగినశాస్తి చేసింది. యూపీలోని బరేలి జిల్లాలో అసభ్యకర మాటలతో వేధించిన ఆకతాయిని అమ్మాయి చితకబాదింది.

బాధితురాలు తనను వేధించిన ఆకతాయి గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు నిందితుడిని పట్టుకుని ఓ చోట కూర్చోబెట్టి ఆ అమ్మాయితో దేహశుద్ధి చేయించారు. బాధితురాలు చెప్పు తీసుకుని పలుమార్లు నిందితుడిని కొట్టింది. మొహంపై ఉమ్మేసి చివాట్లు పెట్టింది. అక్కడున్న యువకులు కొందరు నిందితుడిని కాళ్లతో తన్నారు. కాగా ఇది ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగింది అన్న విషయాలు తెలియరాలేదు. అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement