జమ్మూ కాశ్మీర్ బద్గామ్ జిల్లా పక్రెపోరా వద్ద గస్తీ కోసం ఏర్పాటు చేసిన పోలీసు పోస్ట్పై తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. గత అర్థరాత్రి ఇద్దరు తీవ్రవాదులు పోలీస్ పోస్ట్లోకి ప్రవేశించి.... పోలీసు కానిస్టేబులుపై ఐరన్ రాడ్తో దాడి చేశారు. అనంతరం అక్కడ ఉన్న రైఫిల్స్ను ఆపహరించుకుని పోయారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు.
పోలీసుల పోస్ట్పై తీవ్రవాదులు దాడి
Published Sat, Jun 7 2014 10:45 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM
Advertisement
Advertisement