రెండు రోజుల్లో 25వేల కోట్లు మటాష్!
Published Mon, Jan 9 2017 2:17 PM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM
హెచ్-1బీ వీసాలో నెలకొన్న భయాందోళనతో ఐటీ స్టాక్స్లో నెలకొన్న ఒత్తిడికి టాప్ ఐటీ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. వరుసగా రెండో రోజూ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహింద్రా కంపెనీలను నష్టాలు వీడటం లేదు. దీంతో రెండు రోజుల్లో మిడ్క్యాప్లోని మూడు దిగ్గజ కంపెనీలు విప్రో, టీపీఎస్, ఇన్ఫోసిస్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.25,000 కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయినట్టు తెలిసింది. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్లో నెలకొన్న ఒత్తిడితో ఈ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
వీసాల్లో దుర్వినియోగాన్ని అరికడుతూ హెచ్-1బీ ప్రొగ్రామ్లో కీలక మార్పులను ఉద్దేశించిన బిల్లును అమెరికా కాంగ్రెస్లో మళ్లీ ప్రవేశపెట్టారు. దీంతో ఐటీ స్టాక్స్లో భయాందోళనలు నెలకొన్నాయి. బీఎస్ఈలో శుక్రవారం 2.5 శాతం కోల్పోయిన ఐటీ సబ్-ఇండెక్స్ సోమవారం ట్రేడింగ్లో 0.50 శాతం నష్టపోతుంది. విప్రో, టీసీఎస్, టెక్ మహింద్రాలు 0.50 శాతం నుంచి 1 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇన్ఫోసిస్ 0.40 శాతం పడిపోయింది. అంతేకాక మూడో క్వార్టర్ ఫలితాల నేపథ్యంలోనూ ఐటీ స్టాక్స్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్లు ఈ వారం చివరిలో ఫలితాలు వెల్లడించనున్నాయి.
Advertisement
Advertisement