న్యూయార్క్:నగరంలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయుం విద్యార్థులకు అందిన బెదరింపు ఈ -మెయిల్ కలకలం రేపుతోంది. 'స్వయంగా యూనివర్సిటీకి వచ్చి, మీలో ఒక్కొక్కరినీ కాల్చి చంపేస్తాను' అంటూ బెదిరిస్తూ ఓ వ్యక్తి పంపించిన ఈ మెయిల్, ఈ వారాంతంలో వందలాది మంది విద్యార్థులకు అందింది. జాతివివక్షతో కూడిన పదజాలం ఉన్న ఈ మెయిల్ పై అమెరికన్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తునకు దిగారు.
బెదిరింపు ఇ-మెయిల్ నేపథ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆవరణలో బలగాలను పెంచాలని హార్వర్డ్ పోలీసు యంత్రాంగం భావిస్తోంది. అమెరికా దర్యాప్తు సంస్ధ ఎఫ్‌బీఐకి, న్యూయార్క్ స్థానిక పోలీసు యంత్రాంగానికి ఈ ఇ-మెయిల్ గురించి తెలియజేశారు. తమ పేర్లకు ముందు ఆసియా ప్రాంతపు ఇంటిపేర్లు ఉన్నవారికే ఎక్కువగా ఈ సందేశాలు అందినట్టు కనిపిస్తోంది.
విద్యార్థులకు బెదిరింపు ఈ మెయిల్!
Published Sat, Oct 4 2014 11:18 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM
Advertisement
Advertisement