
హెలికాప్టర్+విమానం..
విమానాన్ని కలిపి మిక్సీలో వేసి తీస్తే.. ఎలాగుంటుంది? ఇదిగో ఇలాగుంటుంది.
హెలికాప్టర్‌ను, విమానాన్ని కలిపి మిక్సీలో వేసి తీస్తే.. ఎలాగుంటుంది? ఇదిగో ఇలాగుంటుంది. ఇది హెలికాప్టర్, విమానంలోని అంశాలు కలగలసిన హైబ్రీడ్ విహంగం ఎస్2. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కు రన్‌వేల్లాంటివక్కర్లేదు. జస్ట్.. హెలికాప్టర్ తరహాలో ఇది దీనికున్న 12 రోటార్ బ్లేడ్ మోటార్ల సాయంతో ఉన్న చోట నుంచే పైకి లేస్తుంది. ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత అవి ముడుచుకుంటాయి. అక్కడ్నుంచి అది విమానం తరహాలో దూసుకుపోతుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జాబీ ఏవియేషన్ సంస్థ ఈ హైబ్రీడ్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్‌ను రూపొందించింది. ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుంది.
ఈ డిజైన్‌పై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆసక్తి కనబరుస్తోంది. 25 కిలోల బరువుండే.. చిన్న సైజు మోడల్ తయారీకి నిధులను అందిస్తోంది. దాని విజయాన్ని బట్టి.. ఈ ప్రాజెక్టుకు మరిన్ని నిధులివ్వడానికి యోచిస్తోంది.