హైదరాబాద్: ప్రముఖ గాయకులైన హేమచంద్ర, శ్రావణ భార్గవి దంపతులు పండంటి బుజ్జాయికి జన్మనిచ్చారు. శ్రావణభార్గవి శనివారం (జూన్ 2న) ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు హేమచంద్ర.
‘మాకు పాప పుట్టింది.. ఇప్పుడు నేను ఇద్దరు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి..’ అని పేర్కొంటూ.. భార్య శ్రావణ భార్గవి, పాపాయితో కలిసి దిగిన ఫొటోను పోస్టుచేశాడు. చక్కగా సినిమా పాటలు పాడుతూ అభిమానుల అలరిస్తున్న హేమచంద్ర, శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే.