ఉద్యోగాలు పెరుగుతాయ్.. | Hiring activity set to improve in 2014: Naukri.com | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు పెరుగుతాయ్..

Published Thu, Jan 9 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

ఉద్యోగాలు పెరుగుతాయ్..

ఉద్యోగాలు పెరుగుతాయ్..

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగ నియామకాలు మెరుగుపడతాయని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీడాట్‌కామ్ తెలిపింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో జోరు దీనికి కారణం కానున్నదని వివరిం చింది. గత ఏడాది నవంబర్‌లోలాగానే గత నెలలో కూడా ఉద్యోగ నియామక కార్యకలాపాలు ఉన్నాయని వివరించింది. హైదరాబాద్, ఢిల్లీలో హైరింగ్ కార్యకలాపాలు గరిష్టంగా మెరుగుపడ్డాయంటున్న ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...,
 

  • ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నందున కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపడుతాయి. ఫలితంగా కొత్త కొలువులు పెరుగుతాయి.
  •  ఆన్‌లైన్ ద్వారా నెలవారీ హైరింగ్ కార్యకలాపాలను ట్రాక్ చేసే నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ గతేడాది డిసెంబర్‌లో 1,296 పాయింట్లకు చేరింది. 2012, డిసెంబర్‌తో పోల్చితే ఇది 13 శాతం అధికం. అయితే గతేడాది నవంబర్‌తో పోల్చితే మాత్రం ఎలాంటి మార్పు లేదు.
  • బీపీవో హైరింగ్ 33% పెరిగింది. ఫార్మా(16%), టెలికాం (7%) చొప్పున వృద్ధి చెందాయి.
  • ఐటీ, బీపీవో, ఫైనాన్స్ రంగాల్లో డిమాండ్ పెరగ్గా, బ్యాంకింగ్, బీమా, సరఫరా చెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు తగ్గాయి.
  • ఇక హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో హైరింగ్ కార్యకలాపాలు బాగా మెరుగుపడగా, చెన్నైలో మాత్రం 4 శాతం తగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement