గుర్దాస్పూర్ దాడి పాక్ పనే | home minister links Gurdaspur attack to Pakistan | Sakshi
Sakshi News home page

గుర్దాస్పూర్ దాడి పాక్ పనే

Published Thu, Jul 30 2015 3:30 PM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

గుర్దాస్పూర్ దాడి పాక్ పనే

గుర్దాస్పూర్ దాడి పాక్ పనే

పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్పై జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ పనేనని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడి విషయమై ఆయన రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. పాక్ నుంచి మన దేశంలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేయడానికే వచ్చారని, సరిహద్దు ఉగ్రవాదాన్ని అణిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

మన దేశ శత్రువులు భారతదేశ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని, పౌరుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అయితే.. హోం మంత్రి ఈ ప్రకటన చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో గందరగోళం సృష్టించారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, ఉగ్రవాద దాడిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేస్తున్నారని డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ పదేపదే చెప్పినా ప్రయోజనం కనపడలేదు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement