రైతులారా... ఈ ద్వీపానికి రండి..! | Horticulture crops cultivation Islanders | Sakshi
Sakshi News home page

రైతులారా... ఈ ద్వీపానికి రండి..!

Published Sun, Jan 31 2016 4:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతులారా... ఈ ద్వీపానికి రండి..! - Sakshi

రైతులారా... ఈ ద్వీపానికి రండి..!

ట్రిస్టన్ డి కన్హా... పేరు మీరెప్పుడూ విని ఉండరు. ఎక్కడో  దక్షిణాఫ్రికా, అమెరికా ఖండాల మధ్య పసఫిక్ మహా సముద్రంలో ఉంటుంది ఈ బుల్లి ద్వీపం. ఏడుమైళ్ల పొడవు మాత్రమే ఉండే ఈ ద్వీపంపై వ్యవసాయం చేసేందుకు రైతులు కావాలట! దాదాపు 38 చదరపు మైళ్ల విస్తీర్ణంలో పాడిపశువుల ఆలనా పాలనా చూసుకోవడంతోపాటు, ఉద్యాన వన పంటల సాగులో నైపుణ్యమున్న రైతుకు ఉద్యోగమిస్తామని ఈ ద్వీపవాసులు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.

విమానాశ్రయం లేని కారణంగా ఈ ద్వీపవాసులు దక్షిణాఫ్రికా నుంచి నెల, రెండు నెలలకు ఒకసారి వచ్చే నౌకల ద్వారా తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అందుకే ఉన్న కొద్దిపాటి నేలపై కాయగూరలు, పండ్లు పండించాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ ద్వీపంలో ఉండే జనాభా ఎంతో మీకు తెలుసా... 300 మంది ప్రజలు 500 గొర్రెలు అంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement