'బంగారు' కొండ కోసం తవ్వకాలు ప్రారంభం | Hunt for 1000 tonnes of Gold begins in Uttar Pradesh fort | Sakshi
Sakshi News home page

'బంగారు' కొండ కోసం తవ్వకాలు ప్రారంభం

Published Fri, Oct 18 2013 11:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

'బంగారు' కొండ కోసం తవ్వకాలు ప్రారంభం

'బంగారు' కొండ కోసం తవ్వకాలు ప్రారంభం

లక్నో : బంగారం నిధి కోసం శుక్రవారం తవ్వకాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం  నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలు ప్రారంభించారు.

దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్‌భక్ష్‌ సింగ్‌   శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఆ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్‌ సర్కారు చెప్పారు. ఆలయంలో బంగారం నిక్షిప్తమై ఉన్నట్టు తనకు కల వచ్చిందని శోభన్‌ సర్కారు   వెల్లడించాడు. అంతే కాకుండా  ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానిమంత్రికి, రిజర్వ్‌ బ్యాంకుకు లేఖలు కూడా రాశారు.

ఉన్నావ్‌ ప్రాంతంలో స్వామి శోభన్‌ సర్కారుకు మంచి పేరుంది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. అందుకే అక్కడివారు ఆయన మాటలు నమ్ముతున్నారు. పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో  తవ్వకాలు చేపట్టింది. 60 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిధి ఎక్కడు ఉందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఆ శాఖ నిమగ్నమైంది. ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించటంతో పురావస్తు శాఖ అధికారులు పూర్తిస్థాయిలో  తవ్వకాలను శుక్రవారం నుంచి మొదలు పెట్టారు.

మరోవైపు బంగారం నిధి ఉందని తెలియడంతో ఎక్కడెక్కడో ఉంటున్న దౌండియా ఖేరా గ్రామస్తులు ఇప్పుడు ఊరికి చేరుకున్నారు. మరోవైపు  బంగారం నిధి తవ్వకాలు సుప్రీంకోర్టు  పర్యవేక్షణలో జరగాలన్న పిటిషన్ను విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కాగా బంగారం నిధి విలువ సుమారు 3లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement