
సుజాతకు స్వయంగా ఫోన్ చేశా: సుష్మ
న్యూఢిల్లీ: విదేశాంగ నూతన కార్యదర్శిగా డాక్టర్ జయశంకర్ ను నియమించిన విషయాన్ని సుజాతా సింగ్ కు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా సమాచారం అందించారు. తాను స్వయంగా సుజాతా సింగ్ తో మాట్లాడినట్టు సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శిగా జయశంకర్ ను ప్రభుత్వం నియమించాలని కోరుకుందని ఆమెతో చెప్పినట్టు తెలిపారు. జయశంకర్ ఈనెల 31న రిటైర్ అవుతున్నందున ఈలోపు విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించామని చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాలతో గురువారం ఆయన విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. సుజాతా సింగ్ ను తొలగించి జయశంకర్ ను నియమించడంతో సుష్మా స్వరాజ్ అసంతృప్తిగా ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.