రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 11 రోజులు బస చేసి గోదావరి పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజమండ్రి తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబు సభ్యలను చంద్రబాబు పరామర్శించారు.
చంద్రబాబు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. పుష్కరాల తొక్కిసలాట ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి.. పుష్కరాలు ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
11 రోజులూ ఇక్కడే ఉంటా..
Published Tue, Jul 14 2015 5:06 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement