మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ | chandrababu naidu narrowly escapes boat accident | Sakshi
Sakshi News home page

మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ

Published Sat, Jul 25 2015 3:59 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ - Sakshi

మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ

గోదావరి నదిలో తప్పిన ప్రమాదం
 సాక్షి, రాజమండ్రి: పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట, తొమ్మిదో రోజున అగ్ని ప్రమాదం ప్రజల కళ్ల ముందు కదులాడుతుండగా పదకొండో రోజు మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గోదావరి పుష్కరాలు శనివారంతో ముగియనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం నదీ విహారం చేశారు. సీఎం ప్రయాణిస్తున్న లాంచి నది మధ్యలోకి వెళ్లిన తరువాత మీడియా ప్రతినిధుల లాంచీని ఢీకొంది. అయితే రెండు లాంచీల డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది.

రాజమండ్రి చేరుకున్న తర్వాత పోలీసులు ఇరు లాంచీల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం లాంచీ విహారానికి సంబంధించి పోలీసు, పర్యాటక శాఖల మధ్య సమాచారలోపం వల్లే ఇలా జరిగిందని గుసగుసలు వినిపించాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement