త్వరలో గురువు చెంతకు శిష్యుడు | In Kolkata, PM Modi Will Meet 97-Year-Old Swami Who Rejected Him for Monk | Sakshi
Sakshi News home page

త్వరలో గురువు చెంతకు శిష్యుడు

Published Mon, May 4 2015 10:34 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

త్వరలో గురువు చెంతకు శిష్యుడు - Sakshi

త్వరలో గురువు చెంతకు శిష్యుడు

కోల్కతా: సన్యాసిగా ఉండిపోతానంటే అందుకు అంగీకరించకుండా.. నువ్వు ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడివని, భారత రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఉపదేశించిన తన గురువు స్వామీ ఆత్మస్థానంద్ మహారాజ్ను త్వరలో భారత ప్రధాని నరేంద్రమోదీ కలవనున్నారు. బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న ఆత్మస్థానంద్ మహారాజ్ గత కొద్దికాలంగా ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు.

ఈ సందర్భంగా మఠానికి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ సుబీర్నందా మహారాజ్ మాట్లాడుతూ.. 'మోదీగారూ ఆత్మస్థానంద్ మహారాజ్ను గురువుగారిగా భావిస్తారు. ఎప్పటి నుంచో ఆయనను కలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మా స్వామీజీ బాగా పెద్దవారైపోయారు. గతకొంతకాలంగా ఆస్పత్రిలో ఉంటున్నారు. రాజ్ కోట్లో కలిసి ఉన్నప్పుడు ఆత్మస్థానంద్ మహారాజ్గారి సలహాలు మోదీ తీసుకునేవారు' అని చెప్పారు.

చివరిసారిగా మోదీ తన గురువును 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలుసుకున్నారు. అనంతరం ప్రధాని అయ్యాక తమ ఆశ్రమానికి రావాల్సిందిగా బేలూర్ మఠం నుంచి మోదీకి లేఖ పంపించారు. యవ్వనంలో నాడు సన్యాసిగా చేరేందుకు వచ్చిన నువ్వు నేడు ప్రధానిగా మఠంలోకి వస్తుంటే చూడాలని ఉంది అని ఆయన లేఖలో రాశారు. అయితే, గత కొంతకాలంగా తీరిక లేకుండా ఉన్న మోదీ ప్రస్తుతం కాస్త విరామం తీసుకుని శనివారం బేలూరు మఠానికి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement