దుషాంబే(తజకిస్థాన్): ఉగ్రవాద గ్రూపులు ఏకమవుతున్న నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు కృతనిశ్చయంతో ఉమ్మడిగా ఎదుర్కోవాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ఆమె శుక్రవారమిక్కడ జరిగిన షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సదస్సులో మట్లాడారు. రాజకీయ, ఆర్థిక, భద్రతా సహకారానికి సంబంధించిన ఎస్‌సీఓలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆమె దరఖాస్తు చేశారు.
సదస్సు సందర్భంగా ఆమె ఇరాన్, తుర్క్‌మెనిస్థాన్‌ల అధ్యక్షుడు హసన్ రౌహానీ, బెర్దీముఖామెదోవ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌లతో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి, పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు.