జమాత్ ఉద్దవా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్‌పె సయీద్ పై ఎలాంటి కేసూ పెండింగ్‌లో లేదంటూ పాకిస్థాన్ చేసిన వాదనపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది
న్యూఢిల్లీ: జమాత్ ఉద్దవా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్‌పె సయీద్ పై ఎలాంటి కేసూ పెండింగ్‌లో లేదంటూ పాకిస్థాన్ చేసిన వాదనపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. హఫీజ్ సయీద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. హఫీజ్‌ను, ముంబై ఉగ్రవాద దాడులకేసులో నిందితుడుగా, ప్రధాన కుట్రదారుగానే పరిగణిస్తున్నామని, అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు విచారణకు అప్పగించాలని పదేపదే కోరినా, ఆ పనిచేయకపోవడం బాధాకరమని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. హఫీజ్ పాకిస్థాన్ పౌరుడు కాబట్టే స్వేచ్ఛగా తిరగగలుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
ముంబై దాడుల కేసులో హఫీజ్‌కు ప్రమేయం ఉందనడానికి 99శాతం ఆధారాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని, అసలు కుట్ర పాకిస్థాన్‌లోనే రూపొందిందని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. హ ఫీజ్‌పై ఎలాంటి కేసు లేదంటూ పాక్ హైకమిషనర్ బాసిత్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే అక్బరుద్ధీన్ తన ప్రతిస్పందన వ్యక్తంచేశారు.