
ఆసియా అమెరికన్లే ధనవంతులు!
శ్వేతజాతి అమెరికన్లతో పోలిస్తే ఏసియన్ అమెరికన్లు సంపాదిస్తున్నదే ఎక్కువని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. ఐ.డబ్ల్యు.పి.ఆర్. (ఇన్‌స్టిట్యూట్ ఫర్ విమెన్స్ పాలసీ రీసెర్చ్) ప్రకారం, శ్వేతజాతి అమెరికన్లతో పోల్చితే చైనా, భారత్, జపాన్, కొరియాలాంటి దేశాల మూలాలున్న ఏసియన్ అమెరికన్లు 13.5 శాతం ఎక్కువ ఆర్జిస్తున్నారు.
శ్వేతజాతి అమెరికన్ మహిళలతో పోల్చితే ఆసియన్ అమెరికన్ మహిళల సంపాదన కూడా ఎక్కువే! నల్లజాతి అమెరికన్లు, స్థానిక అమెరికన్లు, పసిఫిక్ ఐలాండర్స్ (ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, న్యూజిలాండ్, ఫిజిలాంటి దేశాల మూలాలవాళ్లు), హిస్పానిక్ అమెరికన్ల (అర్జెంటీనా, మెక్సికో, క్యూబా, వెనెజువెలాలాంటి స్పానిష్ దేశాల మూలాలవాళ్లు) సంపాదనల మీద జరిగిన ఈ సర్వే హిస్పానిక్ అమెరికన్లు అందరికంటే వెనుకబడి ఉన్నారని చెబుతోంది.