
భారత భవిత ఉజ్వలం
ప్రపంచంలోనే అత్యంత ఆశావహ దేశం గా భారత్ అవతరించిందని రీసెర్చ్ సంస్థ ఐప్‌సాస్ నిర్వహించిన గ్లోబల్ సర్వే వెల్లడించింది. మొత్తం 20 దేశాల్లో 16 వేలమందిపై ఈ సర్వే నిర్వహించారు.
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ దేశం గా భారత్ అవతరించిందని రీసెర్చ్ సంస్థ ఐప్‌సాస్ నిర్వహించిన గ్లోబల్ సర్వే వెల్లడించింది. మొత్తం 20 దేశాల్లో 16 వేలమందిపై ఈ సర్వే నిర్వహించారు.
వివరాలు మరిన్ని...
భారత్‌లో 53 శాతం మంది ప్రజలు భారత భవిష్యత్ బాగుంటుందని భావిస్తున్నారు. ఎన్నికల అనంతరం రాజకీయ సుస్థిరత్వం సాధ్యమవుతుందని మెజారిటీ భారతీయులు భావిస్తున్నారు.
అత్యంత ఆశావహ దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉండగా, కెనడా, ఆస్ట్రేలియాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(4వ స్థానం), స్వీడన్(5), అర్జెంటినా(6), బ్రెజిల్(7), జర్మనీ(8), రష్యా(9), దక్షిణాఫ్రికా(10) ఉన్నాయి. డబ్బు సంపాదించాలన్నా, ఏదైనా రంగంలో విజయం సాధించాలన్నా చాలా కష్టపడాల్సి ఉందని 60 శాతం మంది భారతీయులు భావిస్తున్నారు.
వచ్చే ఏడాది పెరగనున్న వృద్ధి రేటు
న్యూఢిల్లీ: దేశీయంగానే కాకుండా విదేశీ ఆర్థిక వ్యవస్థలు పురోగతి అవకాశాల పట్ల భారత ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫెషనల్స్ ఆశావహంగా ఉన్నారు. వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ జోరుగా ఉంటుందని సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్ ఏటా నిర్వహించే గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ సర్వే(జీఎంఎస్‌ఎస్) వెల్లడించింది. ఈ సర్వేలో భారత ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫెషనల్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు...,
నైతిక నిబద్ధత లేకపోవడంతో ఆర్థిక సంస్థలపై విశ్వాసం ఉండడం లేదు. పశ్చిమాసియాలో అశాంతి కారణంగా ఇంధనం ధరల ప్రభావం ప్రతికూలంగా ఉండొచ్చు. చైనా రికవరీ పురోగతి కన్నా యూరప్ రికవరీ పురోగతి అధిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రాజకీయ సుస్థిరత కూడా ఇదే స్థాయి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.