భారత్‌లో దాడులకు కుట్ర.. ఎన్నారైకి జైలు | Indian man gets 15 yrs in US jail for plotting terror attack in his home | Sakshi
Sakshi News home page

భారత్‌లో దాడులకు కుట్ర.. ఎన్నారైకి జైలు

Published Thu, Mar 9 2017 3:40 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

భారత్‌లో దాడులకు కుట్ర.. ఎన్నారైకి జైలు - Sakshi

భారత్‌లో దాడులకు కుట్ర.. ఎన్నారైకి జైలు

న్యూయార్క్‌: భారత్‌లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులకు సహకరించిన బల్వీందర్‌ సింగ్‌ (42) అనే ప్రవాస భారతీయుడికి అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడైన సింగ్‌ భారత్‌లో దాడులకు కుట్ర పన్నినట్లు నిర్ధారణ కావడంతో యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్డి లానీ హిక్స్‌ అతడికి శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చినట్లు యూఎస్‌ అటార్నీ డేనియల్‌ బోగ్డెన్‌ తెలిపారు.

కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం... పంజాబ్‌ ప్రాంతంలో స్వతంత్ర సిక్కు రాజ్యం స్థాపించే లక్ష్యంతో చేపట్టిన ఖలిస్థాన్‌ ఉద్యమంలో భాగంగా భారత్‌లో దాడులకు పాల్పడేందుకు బల్వీందర్‌ సింగ్, మరికొందరు 2013 అక్టోబర్‌– డిసెంబర్‌ మధ్య కుట్రపన్నారు. 2013 డిసెంబర్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న అతడిని అమెరికా అధికారులు అరెస్ట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement