ఇంటర్నెట్ దిగ్గజాల సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజీన్ దిగ్గజాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ విజ్ఞప్తిమేరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ , యాహూ లు ప్వాణిజ్యపరంగా సెక్స్ నిర్ధారణ పరీక్షల సమాచారాన్ని, ప్రచార ప్రకటనలను నిషేధించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రీ నాటల్ సెక్స్ డిటర్మినేషన్ పరీక్షల నిషేధంలో భాగంగా ఈ మూడు సంస్థలు ఈ కీలక చర్యకు ఆమోదం తెలిపాయని వివరించింది.
సెక్స్ నిర్ధారణ ప్రకటనల శోధనలోని కీలక పదాలను బ్లాక్ చేశాయని జస్టిస్ దీపక్ మిశ్రాలతో , జస్టిస్ సి నాగప్పన్ కూడిన ధర్మాసనానికి ప్రభుత్వం నివేదించింది. దీని ప్రకారం ఇకపై సెక్స్ నిర్ధారణకు సంబంధించిన సమాచారం ఈ సెర్చ్ ఇంజిన్లలో లభించదు
ఈ సమాచారం పొందేందుకు ఎక్కువగా వినియోగించే దాదాపు 22 కీవర్డ్స్‌ను బ్లాక్ చేసినట్టు వివరించింది.
కాగా భారత్‌లో నిషేధించబడిన కొన్ని సెక్స్ నిర్ధారణ ప్రకటనలు దర్శనం కావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డా. సాబూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.