బీమదేవరపల్లి(కరీంనగర్): వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలుడు శనివారం మృతిచెందాడు. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులకు.. ప్రత్యేక పూజలు చేస్తే.. బాలుడు తిరిగి లేస్తాడని ఓ అపరిచిత వ్యక్తి నమ్మబలికాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన కూన దుర్గాప్రసాద్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతున్నాడు.
ఈ రోజు ఉదయం నిద్రలేపడానికి వెళ్లిన తల్లి కుమారుడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటాన్ని గమనించి.. ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు నిర్థారించారు. దీంతో ఆమె ఇంటికి తీసుకొచ్చింది. అదే సమయంలో ఇది గమనించిన అపరిచిత వ్యక్తి బాబు చనిపోలేదని పూజలు చేస్తే లేస్తాడని చెప్పి మూడుగంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అయినా ఫలితం లేకపోవడంతో.. అతన్ని తిరిగి బ్రతికించడానికి తన శక్తి చాలడం లేదని మరొకరి దగ్గరకు తీసుకెళ్దామని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇదంతా బూటకమని.. అతన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
పూజలు చేస్తే పోయిన ప్రాణం తిరిగొస్తుందని..
Published Sat, Aug 15 2015 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM
Advertisement
Advertisement