మళ్లీ ఇజ్రాయిల్ రాజధాని జెరుసలేం ఉద్రిక పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
పాలస్తీనా:మళ్లీ ఇజ్రాయిల్ రాజధాని జెరుసలేం ఉద్రిక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గురువారం జెరుసలేంలో పోలీసులు పాలస్తీనా వ్యక్తిని కాల్చిచంపడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. జెరుసలేంలోని పవిత్ర స్థలానికి అత్యంత సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఒక్కసారి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
పాలస్తీనా దేశీయున్ని ఇజ్రాయిల్ పోలీసులు కావాలనే కాల్చి చంపారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమపై దాడి చేసేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించడంతోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.