జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.
సాక్షి, బెంగళూరు: జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తి ఏవీ చంద్రశేఖర్ నేతృత్వంలోని రెగ్యులర్ బెంచ్ విచారణ జరపనుంది. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదనలు వినిపించనుండగా, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్‌పీపీ)గా భవానీ సింగ్ హాజ రు కానున్నారు. విచారణ నేపథ్యంలో హైకోర్టు చుట్టుపక్కల భద్రతను పటిష్టం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు సీబీఐ కోర్టు గత నెల 27న నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.వంద కోట్ల జరిమానా, విధించడం తెలిసిందే. హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చినా అన్నాడీఎంకే కార్యకర్తలు సంయమనం పాటిం చాలని జయ విజ్ఞప్తి చేశారు.
అయితే, అన్నా డీఎంకే కార్యకర్తలు ఎలాంటి విధ్వంసాని కి పాల్పడినా, తమిళనాడు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మరోవైపు జయ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ముగ్గురు తమిళ మంత్రులు సోమవారం యాగాలు చేశారు.