వీర జవానుల మరణంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ మంత్రులు భీమ్సింగ్, నరేంద్ర సింగ్ లకు జేడీ(యూ) షోకాజ్ నోటీస్ జారీచేసింది. మీపై ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోకూడదో తెలిపాలని సూచించింది. నోటీసు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీరు చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను మంటగలిపేలా ఉన్నాయని పేర్కొంది.
బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి భీమ్సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చావడానికే ప్రజలు ఆర్మీలో చేరతారంటూ నోరు జారారు. దేశ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన మరణించిన వీర జవాన్ల అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు భీమ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత సైనికుల హత్యకు పాకిస్థాన్ బాధ్యత లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ వివాదానికి తెర లేపారు. ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు దుమ్మెత్తి పోయడంతో జేడీ(యూ) నష్టనివారణ చర్యలు ప్రారంభించింది.
భీమ్సింగ్, నరేంద్ర సింగ్లకు షోకాజ్ నోటీస్
Published Sun, Aug 11 2013 3:38 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM
Advertisement