Bhim Singh
-
త్వరలో వలంటీర్ల నియామకం
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: పక్షం రోజుల్లో వలంటీర్లు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్ తెలిపారు. గురువారం నారాయణఖేడ్‌లోని బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఉన్నత పాఠశాలల్లో 500 మంది వలంటీర్ల ఏర్పాటుకు, ప్రాథమిక పాఠశాలల్లో 1,500 మంది వీవీలు, ఆర్వీఎం ద్వారా తెలుగు మీడియంలో 234 మంది అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల కోసం కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించి నట్లు చెప్పారు. జిల్లాలో 746 పాఠశాలల్లో సింగి ల్ టీచర్లు ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. గతంతో పోల్చితే ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడిందని అన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించేలా పేరెంట్స్ సమావేశాలను నిర్వహించాలన్నారు. టెన్త్ విద్యార్థులకు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3 నుండి ఐదారు గ్రూపులు చేసి పాఠ్యాంశాలపై క్విజ్‌పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. దీంతో జీకేతోపాటు, పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుందన్నా రు. ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని, ఈ సారి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కూడా విద్యపై ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఒత్తిడిలు, బదిలీ చేయించే ప్రయత్నాల గూర్చి ప్రస్తావించగా ని క్కచ్చిగా తన పని తాను చేసుకుపోతానని డీఈఓ తెలిపారు. సమావేశంలో ఎంఈఓ భీం సింగ్ పాల్గొన్నారు. అంతకుముందు బాలికల ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థినులను పలు పాఠ్యాంశాలపై ప్రశ్నలడిగారు. విద్యార్థులు వెంటవెంటనే సమాధానాలు చెప్పడంతో బోధనపై డీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని అసౌకర్యాలను ఈ సందర్భంగా విద్యార్థినులు డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. మినరల్‌వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయిస్తామని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా ప్రణాళికాసంఘం మాజీసభ్యుడు నగేష్ షెట్కార్‌లు గతంలో హామీనిచ్చారని విద్యార్థినులు పేర్కొనగా డీఈఓ ఎంపీతో ఫోన్లో మాట్లాడారు. త్వరలో ఏర్పాటు చేయిస్తామని ఎంపీ హామీనిచ్చారని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ భీంసింగ్, పాఠశాల హెచ్ఎం ఇందిరా కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు బీహార్ మంత్రులకు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైనికులు గత వారం ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపిన ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇద్దరు బీహార్ జేడీయూ మంత్రులకు ఆ పార్టీ ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ విలువలు, విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వారం రోజుల్లో చెప్పాలంటూ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి భీమ్‌సింగ్, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్లకు ఈ నోటీసులు పంపింది. వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తడంతోపాటు పార్టీ ప్రతిష్ట దిగజారిందని నోటీసుల్లో మండిపడింది. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసేందుకే పోలీసులను, సైనికులను ప్రభుత్వం నియమిస్తుందంటూ భీమ్‌సింగ్ వ్యాఖ్యానించగా పాక్ సైనికులు భారత జవాన్లపై కాల్పులకు పాల్పడి ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు నరేంద్రసింగ్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. -
భీమ్‌సింగ్, నరేంద్ర సింగ్‌లకు షోకాజ్ నోటీస్
వీర జవానుల మరణంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ మంత్రులు భీమ్‌సింగ్, నరేంద్ర సింగ్ లకు జేడీ(యూ) షోకాజ్ నోటీస్ జారీచేసింది. మీపై ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోకూడదో తెలిపాలని సూచించింది. నోటీసు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీరు చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను మంటగలిపేలా ఉన్నాయని పేర్కొంది. బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి భీమ్‌సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చావడానికే ప్రజలు ఆర్మీలో చేరతారంటూ నోరు జారారు. దేశ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన మరణించిన వీర జవాన్ల అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు భీమ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సైనికుల హత్యకు పాకిస్థాన్ బాధ్యత లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ వివాదానికి తెర లేపారు. ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు దుమ్మెత్తి పోయడంతో జేడీ(యూ) నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. -
మంత్రిగా కొనసాగే హక్కు భీమ్‌సింగ్‌కు లేదు
-
'చావడానికే ప్రజలు ఆర్మీలో చేరతారు'
పాట్నా : భారతీయ జవాన్లపై జేడీయూ పంచాయతీ శాఖ మంత్రి భీమ్‌సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చావడానికే ప్రజలు ఆర్మీలో చేరతారంటూ ఆయన గురువారమిక్కడ నోరు జారటంతో దుమారం రేగింది. మరణించిన వీర జవాన్ల అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు భీమ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన మంత్రి భీమ్ సింగ్‌ను ఆదేశించారు. కాగా భీమ్‌సింగ్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. భీమ్‌సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. జవాన్లను కించపరిస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కాగా పాకిస్తాన్ జరిపిన అమానుష దాడిలో అయిదుగురు భారతీయ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు భారతీయ జవాన్ల హత్యపై తాను ఇచ్చిన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ గురువారం లోక్‌సభలో మరోసారి వివరణ ఇచ్చారు. దాడిలో మిలిటెంట్లు కూడా పాల్గొన్నట్లు తాను చేసిన ప్రకటనను ఆయన సమర్థించుకుంటూ అప్పటికి తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ప్రకటన చేసినట్లు చెప్పారు.