న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైనికులు గత వారం ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపిన ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇద్దరు బీహార్ జేడీయూ మంత్రులకు ఆ పార్టీ ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ విలువలు, విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వారం రోజుల్లో చెప్పాలంటూ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి భీమ్‌సింగ్, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌లకు ఈ నోటీసులు పంపింది.
వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తడంతోపాటు పార్టీ ప్రతిష్ట దిగజారిందని నోటీసుల్లో మండిపడింది. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసేందుకే పోలీసులను, సైనికులను ప్రభుత్వం నియమిస్తుందంటూ భీమ్‌సింగ్ వ్యాఖ్యానించగా పాక్ సైనికులు భారత జవాన్లపై కాల్పులకు పాల్పడి ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు నరేంద్రసింగ్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
ఇద్దరు బీహార్ మంత్రులకు షోకాజ్ నోటీసులు
Published Sun, Aug 11 2013 7:51 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement