హిల్లరీ మద్దతుదారులారా.. ఇక ఇంటికెళ్లి పడుకోండి! | John Podesta says Clinton won't concede election tonight | Sakshi
Sakshi News home page

హిల్లరీ మద్దతుదారులారా.. ఇక ఇంటికెళ్లి పడుకోండి!

Published Wed, Nov 9 2016 1:15 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

హిల్లరీ మద్దతుదారులారా.. ఇక ఇంటికెళ్లి పడుకోండి! - Sakshi

హిల్లరీ మద్దతుదారులారా.. ఇక ఇంటికెళ్లి పడుకోండి!

అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ హిల్లరీ క్లింటన్కు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్రరాజ్య ఎన్నికల్లో అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ను డొనాల్డ్ ట్రంప్ దాటేశారు. ఇక అమెరికా 45వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.  దీంతో హిల్లరీకి మాటలు రాని పరిస్థితి ఏర్పడింది.
 
హిల్లరీ క్లింటన్ ఈ రాత్రికి ఏమీ మాట్లాడరని, ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని మద్దతుదారులకు ఆమె క్యాంపెయిన్ చైర్ జాన్ పొడెస్టా సూచించారు. మాన్హాటన్లోని జవిట్స్ సెంటర్లో తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బుధవారం తర్వాత వరకు దీనిపై ఎలాంటి కామెంట్ను హిల్లరీ చేయరని స్పష్టంచేశారు. హిల్లరీకి మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పొడెస్టా చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement