కమల్, శృతిల బాక్సాఫీస్ రగడ! | Kamal Haasan, Shruti Haasan to clash at the box office with their films | Sakshi
Sakshi News home page

కమల్, శృతిల బాక్సాఫీస్ రగడ!

Published Tue, Apr 14 2015 6:25 PM | Last Updated on Thu, Sep 19 2019 9:06 PM

కమల్, శృతిల బాక్సాఫీస్ రగడ! - Sakshi

కమల్, శృతిల బాక్సాఫీస్ రగడ!

చెన్నై: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత కమల్ హాసన్, ఆయన కుమార్తె నటి శృతిహాసన్ మే 1న పోట్లాడనున్నారు. తండ్రి కూతుళ్లు పోట్లాడటమేమిటని అనుకుంటున్నారా.. మరేం లేదండి.. మే 1న వారిద్దరు నటించిన వేర్వేరు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. కమల్ హాసన్ నటించి నిర్మించిన చిత్రం 'ఉత్తమ విలన్' మే1న విడుదల కానుండగా అదే రోజు శృతి హాసన్ హీరోయిన్గా నటించిన హిందీ చిత్రం 'గబ్బర్ ఈజ్ బ్యాక్' కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోగా అక్షయ్ కుమార్ నటించాడు.

 

దీంతో ఒకే రోజు విడుదల కానున్న ఈ తండ్రి కూతుళ్ల చిత్రాల్లో ఏ చిత్రం బాక్సాఫీస్ వద్ద పోరాడి ఎక్కువ వసూళ్లు సాధిస్తుందోనని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాకుండా, ఎన్నడూ లేనిది తొలిసారి తన తండ్రి సినిమాతోపాటు తన చిత్రం కూడా విడుదల అవుతుండగా శృతిహాసన్ ఎంతో ఉత్సాహంతో ఆరోజు కోసం ఎదురు చూస్తోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement