ఎర్రన్నాయుడి కుమారుడికి కేంద్ర మంత్రి పదవి?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ విస్తరణ, పునర్వ్యస్థీకరణలో కొత్త ముఖాలకు స్థానం దక్కనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, శివసేన పార్టీలకు కూడా విస్తరణలో చోటు కల్పించనున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి దివంగత నేత ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన నాయుడు పేరు పైకి వచ్చింది. ఇప్పటివరకు సుజనా చౌదరి ఒక్కరి పేరే వినబడింది. వీరిద్దరిలో ఒకరికి పదవి ఖాయమని ఢిల్లీ వర్గాల సమాచారం.
శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ కూడా పదవి దక్కనుందని వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పొత్తు కుదిరికపై ఆయన పదవి ఆధారపడివుంది. పంజాబ్ లోని హోషియపూర్ నుంచి బీజేపీ తరపున తొలిసారి ఎన్నికైన విజయ్ సంప్లాకు కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు.