Vijay Sampla
-
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్‌గా విజయ్ సాంప్లా
న్యూఢిల్లీ: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్(ఎన్సీఎస్సీ) చైర్మన్‌గా బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్ సాంప్లా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్ సాంప్లా ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్సీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన గతంలో పంజాబ్‌లోని హోషియార్పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. చదవండి: (క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో) -
దళితుడినే: సమీర్ వాంఖెడే
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే సోమవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్(ఎన్సీఎస్సీ) చైర్పర్సన్ విజయ్ సాంప్లాను కలిశారు. తన కులాన్ని(దళిత) ధ్రువీకరించే పత్రాలను అందజేశారు. తాను ముమ్మాటికీ దళితుడినేనని పేర్కొన్నారు. ఎన్సీఎస్సీ కోరిన అన్ని పత్రాలను, సాక్ష్యాధారాలను అందజేశానని వాంఖెడే చెప్పారు. ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో పట్టుబడిన డ్రగ్స్ కేసును ఆయన దర్యాప్తు చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షలో నెగ్గి, ఎస్సీ కోటాలో ఉద్యోగం సంపాదించడానికి వాంఖెడే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేశాడని, ఆయన దళితుడు కాదని, జన్మతా.. ముస్లిం అని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ కొడుకు ఆర్యన్ నుంచి రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేశారంటూ సమీర్ వాంఖెడే సహా ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎన్సీబీ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించాం
ఎస్సీ వర్గీకరణపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ వర్గీకరణ అంశంపై జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన సిఫారసులపై ఈ అంశంలో ప్రధాన భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర మంత్రి విజయ్ సాంప్లా లోక్‌సభకు తెలిపారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు. -
మూడేళ్లైనా 39 మంది భారతీయుల జాడలేదు
న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఆచూకీ దొరకని భారతీయులను వెతికి స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖల మంత్రి విజయ్ సంప్లా అన్నారు. మూడేళ్ల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయులు ప్రస్తుతం బుదుష్‌లోని జైల్లో ఉండే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే బుదుష్‌లోని జైలు ఎప్పుడో నెలమట్టం అయిందన్న వార్తలు ప్రచారం కావడంతో బాధితుల కుంటుంబాల్లో ఆందోళన తీవ్రమైంది. ఇరాక్ రాయభారి కార్యాలయం ఆదేశానుసారం అధికారులు ఆచూకీ లేని భారతీయుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను ఈ పని నిమిత్తం ఇరాక్‌కు పంపి చర్యలు చేపట్టిందని, త్వరలోనే బాధితులను భారత్‌కు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుదుష్ జైలు గురించి పూర్తి వివరాలు తనకు తెలియదని, విదేశాంగశాఖకు దీనిపై సమాధానం చెబుతుందని కేంద్ర మంత్రి సంప్లా అన్నారు. మీడియా సహకారంతోనే భారతీయులను వెనక్కి రప్పించడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాల్లో తప్పిపోవడం, ఆచూకీ లేకుండా పోయిన భారతీయులు ఎక్కువగా పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారని మంత్రి విజయ్ సంప్లా తెలిపారు. రేపు (సోమవారం) ఇరాక్ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. -
అమృతానందమయికి జెడ్ కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఆధ్మాత్మిక ప్రబోధకురాలు మాతా అమృతానందమయికి కేంద్రం ‘జెడ్ కేటగిరీ’ భద్రతను కేటాయించింది. దీంతో అనుక్షణం ఆమె వెన్నంటి 24 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. యోగా గురువు బాబా రాందేవ్ తరువాత జెడ్ కేటగిరీ భద్రత పొందిన రెండో ఆధ్యాత్మిక వేత్త మాతానే. మాతాకు, ఆమె ఆశ్రమానికి ప్రత్యేక శిక్షణ పొందిన 40 మంది సీఆర్పీఎఫ్ కాపలాగా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మాతాకు ఆశ్రమం చుట్టుపక్కలే ముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు కేంద్రానికి నివేదిక సమర్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఎక్కడికైనా ప్రయాణిస్తే కాన్వాయ్‌లో రెండు ఎస్కార్ట్ వాహనాలుంటాయి. మరోవైపు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి విజయ్ సాంప్లాకు ‘వై ప్లస్’ భద్రతను కల్పించారు. -
బీజేపీ అధ్యక్షుడి రాజీనామా.. అంతలోనే తూచ్
-
బీజేపీ అధ్యక్షుడి రాజీనామా.. అంతలోనే తూచ్
అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా రెండు వారాల సమయం కూడా లేని తరుణంలో పంజాబ్ బీజేపీ రాజకీయం పలు రకాల మలుపులు తిరుగుతోంది. టికెట్ల పంపిణీలో తీవ్ర అసంతృప్తికి లోనైన పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు విజయ్ సంప్లా రాజీనామా చేసినట్లు కథనాలు వచ్చినా, అంతలోనే ఆయన తన రాజీనామా వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. తాను వేరే పనిమీద వెళ్లాను తప్ప.. రాజీనామా చేయడానికి కాదని చెప్పారు. తన రాజీనామా విషయంలో వచ్చినవన్నీ రూమర్లే తప్ప ఏవీ నిజం కాదని మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. అంతకుముందు, ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపినట్లు, దాన్ని ఆయన ఆమోదించలేదని కూడా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 117 స్థానాలున్న అసెంబ్లీకి పోటీ చేసేందుకు తాను సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం పట్టించుకోకుండా తన సొంత జాబితా విడుదల చేయడంతో సంప్లా ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం అక్కడ పాలకపక్షమైన అకాలీదళ్-బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన విజయ్ సంప్లా, కేంద్రంలో సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. -
'కూలీగా పనిచేశా.. మంత్రినవుతాననుకోలేదు'
న్యూఢిల్లీ: ఈ స్థాయికి నేను చేరుకుంటానని ఎన్నడూ ఊహించలేదని సామాజిక న్యాయశాఖామంత్రి విజయ్ సంప్లా అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడం చాలా గర్వంగా ఉందని విజయ్ సంప్లా తెలిపారు. జీవితంలో చాలా సంవత్సరాలు పేదరికాన్ని అనుభవించాను. కూలిగా పనిచేశాను. కలలో కూడా మంత్రినవుతానని అనుకోలేదు. పేదరిక కుటుంబ నేపథ్యం ఉన్న తాను కేంద్రమంత్రి స్థాయి చేరుకోవడం గొప్ప విషయం అని ఆయన తెలిపారు. నవంబర్ 9న జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణలో వ్యవసాయ కూలీగా, ప్లంబర్ గా పనిచేసిన విజయ్ సంప్లా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
నాడు ప్లంబర్.. నేడు కేంద్ర మంత్రి!
ప్రధాని నరేంద్ర మోదీ తాను నడిచొచ్చిన దారి మర్చిపోలేదు. టీ అమ్ముకుని దేశాన్ని ఏలేస్థాయికి చేరిన మోదీ... తనలాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. ఆయనే విజయ్ సంప్లా. ఒకప్పుడు ప్లంబర్ పనిచేసిన సంప్లా అంచెలంచెలు ఎదిగి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. మొదటిసారి ఎంపీగా గెలిచిన ఆయనకు కేబినెట్ పదవి దక్కడం విశేషం. దళిత వర్గానికి చెందిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ లోని హిషియాపూర్(రిజర్వుడ్) స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. మెట్రికులేషన్ చదివిన విజయ్ సంప్లా- పంజాబ్ లో సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ముందు గల్ఫ్ లో ప్లంబర్ గా పనిచేశారు. 59 ఏళ్ల విజయ్ సంప్లా- సొంత గ్రామానికి సర్పంచ్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత పలు కీలక పదవులు చేపట్టారు. పంజాబ్ రాష్ట్ర అడవుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా, పంజాబ్ రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు చైర్మన్ గా పనిచేశారు. బీజేపీ పంజాబ్ రాష్ట్ర శాఖలోనూ పలు పదవులు నిర్వహించారు. ఎంపీగా గెలిచేంత వరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ సంప్లాకు కేంద్ర పదవి దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. -
ఎర్రన్నాయుడి కుమారుడికి కేంద్ర మంత్రి పదవి?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ విస్తరణ, పునర్వ్యస్థీకరణలో కొత్త ముఖాలకు స్థానం దక్కనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, శివసేన పార్టీలకు కూడా విస్తరణలో చోటు కల్పించనున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి దివంగత నేత ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన నాయుడు పేరు పైకి వచ్చింది. ఇప్పటివరకు సుజనా చౌదరి ఒక్కరి పేరే వినబడింది. వీరిద్దరిలో ఒకరికి పదవి ఖాయమని ఢిల్లీ వర్గాల సమాచారం. శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ కూడా పదవి దక్కనుందని వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పొత్తు కుదిరికపై ఆయన పదవి ఆధారపడివుంది. పంజాబ్ లోని హోషియపూర్ నుంచి బీజేపీ తరపున తొలిసారి ఎన్నికైన విజయ్ సంప్లాకు కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు.