'కూలీగా పనిచేశా.. మంత్రినవుతాననుకోలేదు'
న్యూఢిల్లీ: ఈ స్థాయికి నేను చేరుకుంటానని ఎన్నడూ ఊహించలేదని సామాజిక న్యాయశాఖామంత్రి విజయ్ సంప్లా అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడం చాలా గర్వంగా ఉందని విజయ్ సంప్లా తెలిపారు.
జీవితంలో చాలా సంవత్సరాలు పేదరికాన్ని అనుభవించాను. కూలిగా పనిచేశాను. కలలో కూడా మంత్రినవుతానని అనుకోలేదు. పేదరిక కుటుంబ నేపథ్యం ఉన్న తాను కేంద్రమంత్రి స్థాయి చేరుకోవడం గొప్ప విషయం అని ఆయన తెలిపారు.
నవంబర్ 9న జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణలో వ్యవసాయ కూలీగా, ప్లంబర్ గా పనిచేసిన విజయ్ సంప్లా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.