2014లో కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ ల మధ్య 'మహాభారత యుద్ధం' | Lok Sabha polls to be 'Mahabharath yudh' between Cong-RSS:Chidambaram | Sakshi
Sakshi News home page

2014లో కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ ల మధ్య 'మహాభారత యుద్ధం'

Published Sun, Oct 27 2013 12:00 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

2014లో కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ ల మధ్య 'మహాభారత యుద్ధం' - Sakshi

2014లో కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ ల మధ్య 'మహాభారత యుద్ధం'

2014 పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ ల మధ్య జరిగే 'మహాభారత యుద్ధం' అని ఆర్ధిక మంత్రి పి చిదంబరం వ్యాఖ్యానించారు. రాజకీయాలతో ఆర్ఎస్ఎస్ కు ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పరోక్షంగా బీజేపీని నియంత్రిస్తోందని.. అందుకే ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మహాభారత యుద్దం జరుగబోతుందంటూ చిదంబరం అన్నాడు.

 

తిరుచురాపల్లిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిదంబరం ప్రసంగించారు. మత ప్రాతిపాదికన ప్రజలను విడదీయడానికి ఆర్ఎస్ఎస్ దుష్ట ప్రయత్నాలను ప్రారంభించిందని చిదంబరం ఆరోపించారు. గుజరాత్ లో ముస్లిం యువకులను ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చి చంపారని.. తాను హోంమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్ కౌంటర్లను ఒప్పుకోలేదు అని అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement