
మళ్లీ ఆమెకే పట్టం
తృణమూల్ చైర్‌పర్సన్‌గా మమత మరోసారి ఎన్నిక
కోల్‌కతా: ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్‌పార్టీ(టీఎంసీ) చైర్‌పర్సన్‌గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం మళ్లీ ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవిలో ఆరేళ్లపాటు కొనసాగుతారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సంస్థాగత ఎన్నికల అనంతరం ఆమె సమక్షంలో పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్ ఈ విషయం వెల్లడించారు.
అనంతరం మమతా మాట్లాడుతూ తాను ఇతర పనుల్లో తీరిక లేకుండా ఉన్నందున ఈ బాధ్యతను వేరొకరికి అప్పగిస్తే బాగుండేదని అన్నారు. తాను కార్యకర్తగా ఉండేందుకే ఇష్టపడతానని, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి సంపద వంటి వారని, నాయకులు కాదని ఆమె అభిప్రాయపడ్డారు.