సూపర్ స్టార్‌ ఇంట్లోకి చొరబడ్డ అభిమాని! | Man Arrested for Trespassing Bachchan Residence; Wanted to Sing a Song for Big B | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్‌ ఇంట్లోకి చొరబడ్డ అభిమాని!

Published Mon, Aug 1 2016 5:04 PM | Last Updated on Mon, May 28 2018 3:50 PM

సూపర్ స్టార్‌ ఇంట్లోకి చొరబడ్డ అభిమాని! - Sakshi

సూపర్ స్టార్‌ ఇంట్లోకి చొరబడ్డ అభిమాని!

ముంబై: బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ అతనికి చాలా ఇష్టం. అమితాబ్‌ కోసం ఆయన ఎదురుగా ఓ పాట పాడాలని అతను అనుకున్నాడు. అంతే జుహూలోని ఆయన నివాసంలోకి చొరబడ్డాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 7 గంటలకు జరిగింది. అమితాబ్‌ ఇంట్లోకి చొరబడుతుండగా సదరు వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని పోలీసులకు అప్పగించారు.

అతను బిహార్‌కు చెందిన వాడని, అమితాబ్‌ కోసం పాట పాడాలనే ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రతి ఆదివారం అమితాబ్‌ బచ్చన్‌ తన ఇంటిబయట ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులను కలుస్తారు. ఆయనను కలిసేందుకు ప్రతివారం వేలాదిమంది అభిమానులు ఆయన ఇంటిముందు గుమిగూడుతారు. ముంబైలో ఉంటే తప్పకుండా బిగ్‌ బీ ఫ్యాన్స్‌ను కలిసి.. వారిని ఖుషి చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement