హెలికాప్టర్ ను తగులబెట్టిన కేసులో మావోయిస్టు అరెస్ట్ | Maoist involved in Venkiah Naidu helicopter burning arrested | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్ ను తగులబెట్టిన కేసులో మావోయిస్టు అరెస్ట్

Published Mon, Oct 13 2014 8:54 PM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM

Maoist involved in Venkiah Naidu helicopter burning arrested

గయా(బీహార్): బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హెలికాప్టర్ ను తగులబెట్టిన కేసుతో సంబంధమున్న పరాస్ యాదవ్ అనే మావోయిస్టును బీహార్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గయా జిల్లాలోని నవాదిహ్ గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి తెలిపారు.

2005లో ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గయా జిల్లాలోని పరారియా గ్రామంలో మిడిల్ స్కూల్ పాఠశాల ప్రాంగణంలో అత్యవసరంగా దిగింది. తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా గమ్యానికి చేరుకున్నారు. ఈ హెలికాప్టర్ ను మావోయిస్టులు తగులబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement