న్యూఢిల్లీలో ఆఫ్ఘాన్ చిన్నారిపై అత్యాచారం! | Minor Aghan girl allegedly raped in Delhi | Sakshi

న్యూఢిల్లీలో ఆఫ్ఘాన్ చిన్నారిపై అత్యాచారం!

Published Fri, Nov 22 2013 9:08 AM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

Minor Aghan girl allegedly raped in Delhi

దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఆఫ్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చి ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో స్థిరపడిన కుటుంబానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. దాంతో ఆ చిన్నారి తల్లి పోలీసులకు ఆశ్రయించింది.  నిన్న సాయంత్రం తన కుమార్తెను నిద్రపుచ్చి....అనంతరం  పని మీద బయటకు వెళ్లి అరగంటలో ఇంటికి తిరిగి వచ్చానని, అప్పటికే తన కుమార్తె శరీర భాగాల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతూ ఏడుస్తు కనిపించిందని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.  దాంతో పోలీసులు ఆ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

అయితే ఆ చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స కోసం సర్థార్జంగ్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో చిన్నారిని సర్థార్జంగ్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. కాగా చిన్నారిపై అత్యాచారం జరిగిందా లేక అనుకోకుండా ఏదైన ప్రమాదం జరిగిందా అనేది వైద్య పరీక్షల ద్వారా వెల్లడి కావలసి ఉందని పోలీసులు వెల్లడించారు. వైద్య నివేదిక అందితే కానీ ... అసలు విషయం  వెలుగులోకి వస్తుందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement