బీహార్ రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలోని ధరార గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిపి అనంతరం హత్య చేశారని జిల్లా ఎస్పీ వికాస్ బర్మన్ శనివారం వెల్లడించారు. ఆ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగిందని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఆ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు.
ఈ రోజు ఉదయం స్థానికులు ఆ చిన్నారి మృతదేహన్ని వాటర్ ట్యాంక్ వద్ద చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల వివరాలు ఏమి తేలియలేదని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.