ఈశాన్య రాష్ట్రాలు, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది.
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాలు, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. భారత్-మయన్మార్ సరిహద్దున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
భూప్రకంపనలు రావడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. ప్రపంచంలో భారీ భూకంపం సంభవించే అవకాశం గల ఆరో జోన్‌గా అసోం, మేఘాలయా, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్టాలను గుర్తించారు.