బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగిన శ్రీనివాసన్ అల్లుడు, చెన్నయ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మాజీ టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్ తదితరులపై ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు.
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగిన శ్రీనివాసన్ అల్లుడు, చెన్నయ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మాజీ టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్ తదితరులపై ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్ సహా మరో 20 మంది పేర్లు ఉన్నాయి. పాకిస్థాన్ అంపైర్ అసద్ రవూఫ్, 15 మంది బుకీల పేర్లను ఇందులో ప్రస్తావించారు.
ముంబై పోలీసులు మొత్తం 11,500 పేజీల నివేదికను రూపొందించారు. 2013 ఐపీఎల్ సీజన్ సందర్భంగా బెట్టింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై మేయప్పన్, దారా సింగ్ను గతంలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.