10 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి పదిరోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల్లో బహుపాక్షిక సదస్సులు, ద్వైపాక్షిక సమాశాల్లో ఆయన పాల్గొంటారు. ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి అంశాలను ముందుకు తీసుకెళ్లనున్నారు. మయన్మార్ రాజధానిలో ఈనెల 12, 13 తేదీల్లో జరిగే తూర్పు ఆసియా శిఖరాగ్ర భేటీలో మోదీ పాల్గొంటారు. మయన్మార్ చైనా ప్రధాని లీ కెకియాంగ్ తో ఆయన భేటీ అవుతారు.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరవుతారు. నల్లధనం నివారణకు దేశాల మధ్య సహకారం గురించి ఆయన ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నవంబర్ 15న ప్రారంభం కానుంది. 28 ఏళ్ల భారత ప్రధాని ఆస్ట్రేలియా పర్యటించనున్నారు. 1986లో రాజీవ్ గాంధీ తర్వాత ఆస్ట్రేలియా వెళుతున్న భారత ప్రధాని మోదీ కావడం విశేషం.