'మార్స్ ఆర్బిటెర్ మిషన్' ప్రయోగం వెనుక రాజకీయాల్లేవు: ఇస్రో
'మార్స్ ఆర్బిటెర్ మిషన్' ప్రయోగం వెనుక రాజకీయాల్లేవు: ఇస్రో
Published Tue, Oct 29 2013 4:22 PM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
దేశ అణు పరిశోధన కార్యక్రమాల్లో తలమానికంగా నిలిచే మార్స్ ఆర్బిటెర్ మిషన్(ఎంఓఎమ్)కు ఆదివారం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ25 ను నవంబర్ 5న 2.36నిమిషాలకు మార్స్ ఆర్బిటెర్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించనున్నారు. అక్టోబర్ 31 తేదిన బెంగుళూరు లోని స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ లో కూడా ప్రారంభ కార్యక్రమాన్ని రిహార్సల్ చేయనుంది. రిహార్సల్ సవ్యంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు,జాగ్రత్తలు తీసుకున్నామని.. ఇస్పో చైర్మన్ కే రాధకృష్ణన్ తెలిపారు.
చంద్రయాన్-1 మిషన్ తర్వాత జి మాధవన్ నాయర్ కు 'మూన్ మ్యాన్' అన్నారని.. అయితే మార్స్ మ్యాన్ అనిపించుకోవాలని లేదు అని ఓ ప్రశ్నకు రాధకృష్ణన్ సమాధానమిచ్చారు. ఎన్నికల సంవత్సరం కావడంతో మార్స్ ఆర్బిటెర్ మిషన్ ప్రయోగాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. మార్స్ ప్రయోగం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.
Advertisement