K Radhakrishnan
-
విజయవంతంగా మంగళ్ యాన్ ప్రయోగం: రాధాకృష్ణ
చెన్నై: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళ్యాన్ ప్రయోగం విజయవంతంగా సాగుతోందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మీడియాకు వెల్లడించారు. సెప్టెంబర్ 24 కల్లా అంగారక కక్ష్యలోకి మంగళయాన్ ప్రవేశిస్తుందని రాధాకృష్ణన్ తెలిపారు. మంగళయాన్ ప్రయోగంలో ఇంకా 14% యాత్ర మాత్రమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది నవంబర్ 5న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్ వీ బోర్డుపై నుంచి మార్స్ అర్బిటర్ ప్రయోగం ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. మార్స్ ఆర్బిటర్ ప్రయోగంపై మంగళవారం చెన్నైలో సమీక్ష నిర్వహించారు. -
ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు సమైక్య సెగ
-
ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు సమైక్య సెగ
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు సమైక్య సెగ తగిలింది. పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతమైన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు సమైక్యాంధ్రకు మద్దతుగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళం వినిపించారు. ఊహించని పరిణామంతో రాధాకృష్ణన్ కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత తేరుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రాంత ఆకాంక్షను కేంద్ర మంత్రి వి నారాయణస్వామికి తెలిపేందుకు జర్నలిస్టులు సమైక్య నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో నారాయణస్వామి సభ్యుడిగా ఉన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం తరపున నారాయణస్వామి హాజరయ్యారు. మరోవైపు 'తమిళ త్రయం'గా ముద్రపడిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, నారాయణస్వామి తమ రాష్ట్రాన్ని విడదీసేందుకు కంకణం కట్టుకున్నారని సీమాంధ్రుల్లో గూడుకట్టున్న ఆవేదన కూడా సీమాంధ్ర విలేకరుల నిరసనకు కారణంగా కనబడుతోంది. ఏదీఏమైనా షార్ వేదికగా సీమాంధ్ర జర్నలిస్టులు సమైక్య గళం వినిపించారు. -
పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతం
-
పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట: అంతరిక్ష రంగంలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి బయలుదేరిన పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక 44 నిమిషాల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. షార్ శాస్తవేత్తలకు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న సీనియర్ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలి ప్రయత్నంలోనే మంగళయాన్ విజయవంతం కావడం పట్ల హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మార్స్ మిషన్ కీలకమైనది మిషన్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అన్నారు. ఈ విజయం తొలి అడుగు అని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ రామకృష్ణన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి విజయమిదని షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రయోగంలో పాలుపంచుకున్న వారందరికీ ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు. -
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అగ్నిప్రమాదం
చిత్తూరు: శ్రీకాళహస్తీశ్వరాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణద్వారం వద్ద ఉన్న ఓ షాపులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలార్పేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్‌సర్క్యూటే కారణంగానే మంటలంటుకున్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు. కాగా, శ్రీకాళహస్తి స్వామివారిని ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహక వాహకనౌకను రేపు ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయనిక్కడకు వచ్చారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక మంగళవారం మధ్యాహ్నం 2:38 గంటలకు నింగికి దూసుకుపోనుంది. -
'మార్స్ ఆర్బిటెర్ మిషన్' ప్రయోగం వెనుక రాజకీయాల్లేవు: ఇస్రో
దేశ అణు పరిశోధన కార్యక్రమాల్లో తలమానికంగా నిలిచే మార్స్ ఆర్బిటెర్ మిషన్(ఎంఓఎమ్)కు ఆదివారం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ25 ను నవంబర్ 5న 2.36నిమిషాలకు మార్స్ ఆర్బిటెర్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించనున్నారు. అక్టోబర్ 31 తేదిన బెంగుళూరు లోని స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ లో కూడా ప్రారంభ కార్యక్రమాన్ని రిహార్సల్ చేయనుంది. రిహార్సల్ సవ్యంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు,జాగ్రత్తలు తీసుకున్నామని.. ఇస్పో చైర్మన్ కే రాధకృష్ణన్ తెలిపారు. చంద్రయాన్-1 మిషన్ తర్వాత జి మాధవన్ నాయర్ కు 'మూన్ మ్యాన్' అన్నారని.. అయితే మార్స్ మ్యాన్ అనిపించుకోవాలని లేదు అని ఓ ప్రశ్నకు రాధకృష్ణన్ సమాధానమిచ్చారు. ఎన్నికల సంవత్సరం కావడంతో మార్స్ ఆర్బిటెర్ మిషన్ ప్రయోగాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. మార్స్ ప్రయోగం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.