
గోదావరి జలాలకు ట్రిబ్యునల్ అవసరం లేదు: జైపాల్
న్యూఢిల్లీ: భద్రాచలం, హైదరాబాద్తో కూడిన పూర్తి తెలంగాణ కావాలని కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు.తెలంగాణలో భద్రాచలం, హైదరాబాద్ అందర్భాగమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం)తో సమావేశం ముగిశాక బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల వరకు విద్యుత్ సమస్య వచ్చే అవకాశముందని, దీన్ని అధిగమించే వరకు ప్రస్తుతమున్న విద్యుత్ విధానాన్ని కొనసాగించాలని కోరారు.
ఆర్టికల్ 371డీ కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. రెండు ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేయాలన్నారు. విభజన బిల్లులో ఈ అంశం పొందుపరచాలని సూచించారు. కృష్ణాకు ట్రిబ్యునల్ అవసరమే కానీ, గోదావరికి అవసరం లేదన్నారు. గోదావరికి బోలెడు మిగులు జలాలు ఉన్నాయన్నారు. జీఓఎంకు ఇచ్చిన నివేదికను మీడియాకు వెల్లడించబోమని జైపాల్ రెడ్డి అన్నారు.