తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను దసరా పండగ లోపు భర్తీ చేయాలని అధికార టీఆర్ఎస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను దసరా పండగ లోపు భర్తీ చేయాలని అధికార టీఆర్ఎస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది.
మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ గురువారం భేటీకానుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై త్రిసభ్య కమిటీ చర్చించనుంది.