
బిఎస్ఎన్ఎల్ మరో ప్రమోషనల్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ల్యాండ్‌లైన్ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. 'ఎక్స్పీరియన్స్ ఎల్‌ఎల్ 49' అనే కొత్త ప్రమోషనల్ ఆఫర్ ప్రారంభించింది. దీని ద్వారా ల్యాండ్లైన్ ఖాతాదారులకు అపరిమిత కాలింగ సౌకర్యాన్ని అందిస్తోంది. కేవలం రూ.49కే ల్యాండ్లైన్ కనెక్షన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ 'ఎక్స్పీరియన్స్ ఎల్‌ఎల్ 49' ఆఫర్ కింద రూ.49లకే లాండ్ లైన్ కనెక్షన్ రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు రాత్రి 9గం.నుంచి ఉదయం 7గం. లవరకు ఉచిత కాలింగ్ ఆఫర్. అలాగే నెలలోని అన్ని ఆదివారాల్లో ఏ నెట్ వర్క్‌కైనా (24 గంటలూ) అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆరునెలల సమయం ముగిసిన అనంతరం వినియోగదారులు నెలవారీ ప్లాన్ ప్రకారం రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.
ఇదే సేవలో ఉచితంగా ఒక సిమ్ కార్డ్ ను కూడా ఉచితంగా అందిస్తోంది. అలాతే కొత్త వినియోగదారులు రూ.149 రీచార్జ్‌పై ఏ నెట్‌వర్క్‌కైనా (లోకల్ అండ్ ఎస్టీడీ) ప్రతిరోజు 30 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం కల్పిస్తోంది.