unlimited voice calls
-
రిలయన్స్ జియో యూజర్లకు బంపర్ అఫర్
కొత్త జియో ఫోన్ కొనుగోలు చేసే యూజర్లకు, ఇప్పటికే జియోఫోన్ కలిగిఉన్న యూజర్ల కోసం బంపర్ ఆఫర్‌ను రిలయన్స్ జియో తీసుకొచ్చింది. జియోఫోన్ 2021 ఆఫర్ కింద యూజర్లు రెండేళ్ల వరకు ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి నెల 2జీబీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. దేశంలోనే అతి పెద్ద టెలికాం ఆపరేటర్ సంస్థ జియో రూ.1999లతో జియో ఫోన్ కొనుగోలు చేస్తే 24 నెలల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ ను ప్రతి రోజూ 2జీబీ డేటాను అందిస్తుంది. ఈ ఆఫర్ ను ఎంచుకునే చందారులకు డేటా, అపరిమిత కాల్స్ సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. ఇది ముఖ్యంగ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీనికోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు జియోఫోన్ తో పాటు 12 నెలల ఆన్ లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. అలాగే ఇప్పటికే జియోఫోన్ కలిగి ఉన్న వినియోదారుల కోసం మరో కొత్త ఆఫర్ ని ప్రకటించింది. ప్రతి నెల 2జీబీ డేటాతో పాటు, ఉచిత వాయిస్ కాల్స్ ను కేవలం రూ.749 అఫర్ ధరకే పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఈ ఆఫర్‌ను ప్రకటించినప్పుడు, రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. “భారతదేశం లో జియోకు 300 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారని వారికి డేటా సేవలు మరింత దగ్గరగా తీసుకుని వెళ్లడం కోసమే తమ ప్రయత్నమని చెప్పారు. అలాగే ప్రస్తుతం 2జీ, 3జీ ఫోన్ లు వాడుతున్న వారికి 4జీ సేవలు అందించడమే తమ లక్ష్యమని" పేర్కొన్నారు. చదవండి: ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు 2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం -
బీఎస్ఎన్ఎల్ దసరా ఆఫర్: రోజుకు 2జీబీ డేటా
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దసరా ఆఫర్‌గా స్పెషల్ టారిఫ్ వోచర్‌ను లాంచ్ చేసింది. ప్రధాన ప్రత్యర్థులు జియో, ఎయిర్‌టెల్‌కు సవాలుగా బీఎస్ఎన్ఎల్ చవకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. లిమిటెడ్ ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రీపెయిడ్ చందాదారుల కోసం ఒక ప్రత్యేక ఎస్టీవీ ప్రారంభించింది. రూ .78 ధరకే, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. ఈ పరిమితి కాలంగా లాంచ్ చేసిన ఇది అక్టోబర్ 15 నుండి భారతదేశం అంతటా అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రణాళిక కొన్ని ఆసక్తికరమైన ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకు హై-స్పీడ్ 2జీబీ డేటాఆఫర్ చేస్తోంది.10 రోజుల వాలిడిటీ అంటే మొత్తం 20జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అంతేకాదు 3జీబీ టెక్నాలజీ ఫాస్ట్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇందులో అపరిమిత వీడియో కాల్స్ కూడా అందిస్తోంది. Make this festive season even more joyful in just Rs. 78. Enjoy unlimited data and voice with #BSNL STV 78. pic.twitter.com/bW9Wg84day — BSNL India (@BSNLCorporate) October 15, 2018 -
వాయిస్ కాల్స్‌పై జియో షాక్
జియో సిమ్ ఉంటే చాలు.. ఎన్ని నిమిషాలైనా, ఎన్ని గంటలైనా అలా ఎన్ని రోజులైనా అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ఇది ఇప్పడి వరకున్న ట్రెండ్. ప్రస్తుతం జియో తన కస్టమర్లకు షాకివ్వబోతుంది. అదీ అందరికీ కాదు. కొందరికి మాత్రమే. వాయిస్ కాల్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వాడేసే కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్ ఫీచర్‌ను పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. సాక్షి, న్యూఢిల్లీ: వాయిస్ఓవర్ను వాడుకుంటూ తమ నెట్‌వర్క్‌పై కేవలం రోజుకు 300 నిమిషాల కాల్స్‌ను మాత్రమే వాడుకునేలా జియో నిబంధన పెట్టబోతున్నట్టు రిపోర్టులు తెలిపాయి. అపరిమిత కాల్స్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే నేపథ్యంలో ఈ కాల్స్‌ను పరిమితం చేస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. టెలికాంటాక్‌కు జియో ప్రియారిటీ టీమ్ ఈ విషయాన్ని నిర్థారించిందట. కొందరు యూజర్లకు రోజుకు 300 నిమిషాల వాయిస్ కాల్స్‌ను మాత్రమే జియో పరిమితం చేస్తుందని, అపరిమిత కాల్స్ ఫీచర్‌తో కొందరు యూజర్లు రోజుకు 10 గంటలకు పైగా వాడుకుంటూ.. ఆ ఫీచర్‌ను దుర్వినియోగపరచడమే దీనికి ప్రధాన కారణమని రిపోర్టు వెల్లడించింది. కస్టమర్లకు అందాల్సిన సేవలు పక్కదారి పడుతున్నాయని జియో గుర్తించినట్టు రిపోర్టు చేసింది. ఇలా పరిమితం చేస్తున్న వాయిస్ కాల్స్‌ను రోజూ పాటించాలని చూస్తుందట. 4జీ డేటా వాడకం లాగానే వాయిస్ కాల్స్‌పైనా పరిమితి తెస్తున్నట్టు రిపోర్టు వెల్లడించింది. 2016 సెప్టెంబర్‌లో జియో సేవలు లాంచ్ అయినప్పుడు, అపరిమిత 4జీ డేటాను ఆఫర్ చేసింది. అనంతరం డేటా వాడకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించిన జియో, తరువాత డేటా వాడకంపై పరిమితి పెట్టింది. ప్రస్తుతం రోజుకు 1జీబీ డేటానే ఆఫర్ చేస్తోంది. అపరిమిత డేటా వాడకం ఉన్నప్పటికీ, 1జీబీ డేటా వాడకం అయిపోయిన తర్వాత డేటా స్పీడు 100 కేబీపీఎస్ కంటే పడిపోయింది. అయితే ప్రస్తుతం వాయిస్ కాల్స్‌పై పెడుతున్న పరిమితి కొందరు యూజర్లకేనని తెలిసింది. అది కూడా జియో నెట్‌వర్క్‌ను దుర్వినియోగం చేసేవారికేనట. అయితే ఎవరు ఈ కేటగిరీ కిందకి వస్తున్నారో ఇంకా స్పష్టం కాలేదు. రోజుకు 10 గంటల కంటే ఎక్కువ వాయిస్ కాల్స్‌ను వాడే వారు ఈ కేటగిరీ కిందకి వస్తారంటూ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కాల్స్‌పై గరిష్ట పరిమితి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రస్తుతానికి దీనిపై అధికారికంగా ప్రకటన చేయని జియో, త్వరలోనే విధివిధానాలు వెల్లడించనుందట. -
రాఖీ గిఫ్ట్: బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్
రక్షా బంధన్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రభుత్వరంగ టెలికాం బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 'రాఖీ పె సౌగత్' రీఛార్జ్ ప్లాన్‌ను తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 74 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాల్స్‌ను, డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది. అయితే ఇది కేవలం తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు, ఐదు రోజుల వరకే వాలిడ్‌లో ఉంటుంది. కానీ ఐదురోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ ఆన్ నెట్ ద్వారా తమ కస్టమర్లకు చేసుకోవచ్చు. టాక్ వాల్యుతో పాటు ఐదు రోజుల వరకు 1జీబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చు. నేటి(ఆగస్టు3) నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తోందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. 12 రోజుల వరకు ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పండుగలను పురస్కరించుకుని ఇలాంటి చౌక టారిఫ్‌లను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయడం సంప్రదాయమని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్కే మిట్టల్ తెలిపారు. అదనంగా రూ.189, రూ.289, రూ.389లతో కొన్ని కొంబో ఆఫర్లను కూడా బీఎస్ఎన్ఎల్ లాంచ్చేసింది. ఈ ఆఫర్స్‌లో అదనంగా 18 శాతం టాక్ వాల్యు, 1జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 128జీబీ డేటాతో 'సిక్సర్ 666' ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద తన ప్రీపెయిడ్ యూజర్లు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 60 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జియోకు కౌంటర్ ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఫెస్టివ్ సీజన్లో కస్టమర్లను మరింత ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. -
బిఎస్ఎన్ఎల్ మరో ప్రమోషనల్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ల్యాండ్‌లైన్ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. 'ఎక్స్పీరియన్స్ ఎల్ఎల్ 49' అనే కొత్త ప్రమోషనల్ ఆఫర్ ప్రారంభించింది. దీని ద్వారా ల్యాండ్‌లైన్ ఖాతాదారులకు అపరిమిత కాలింగ సౌకర్యాన్ని అందిస్తోంది. కేవలం రూ.49కే ల్యాండ్‌లైన్ కనెక్షన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ 'ఎక్స్పీరియన్స్ ఎల్ఎల్ 49' ఆఫర్ కింద రూ.49లకే లాండ్ లైన్ కనెక్షన్ రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు రాత్రి 9గం.నుంచి ఉదయం 7గం. లవరకు ఉచిత కాలింగ్ ఆఫర్. అలాగే నెలలోని అన్ని ఆదివారాల్లో ఏ నెట్ వర్క్‌కైనా (24 గంటలూ) అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆరునెలల సమయం ముగిసిన అనంతరం వినియోగదారులు నెలవారీ ప్లాన్ ప్రకారం రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇదే సేవలో ఉచితంగా ఒక సిమ్ కార్డ్ ను కూడా ఉచితంగా అందిస్తోంది. అలాతే కొత్త వినియోగదారులు రూ.149 రీచార్జ్‌పై ఏ నెట్‌వర్క్‌కైనా (లోకల్ అండ్ ఎస్టీడీ) ప్రతిరోజు 30 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం కల్పిస్తోంది. -
149కే అపరిమిత వాయిస్ కాల్స్, డేటా
జనవరి 1 నుంచి బీఎస్ఎన్ఎల్ నూతన పథకం భోపాల్: ఏ నెట్ వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్‌కు వీలు కల్పించే నెలవారీ పథకాలను బీఎస్ఎన్ఎల్ తీసుకురానుంది. ఉచిత డేటాతో కలుపుకుని ఈ ప్లాన్ ధర రూ.149గా ఉండనుంది. ఏ నెట్‌వర్క్‌కు అయినా స్థానిక, ఎస్టీడీ అపరిమిత కాల్స్‌తోపాటు కొంత ఉచిత డేటాతో కలుపుకుని రూ.149 లేదా అంతకంటే తక్కవకే వచ్చే నెల నుంచి ఓ పథకాన్ని తీసుకురానున్నట్టు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. భోపాల్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధాన దిశలో ఉందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, నిర్వహణ లాభాలను ఆర్జిస్తున్నామని శ్రీవాస్తవ వెల్లడించారు. ‘‘ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్నాం. తర్వాత ఆరో స్థానికి పడిపోయాం. ఇప్పుడు తిరిగి నాలుగో స్థానానికి చేరుకున్నాం’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం 10 శాతం కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వెంట ఉన్నారని, 15 శాతానికి పెంచుకునే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వాయిస్‌కాల్స్ బస్ చేజారిపోయిందని, డేటా వ్యాపార బస్ మాత్రం చేజారనివ్వమన్నారు. ల్యాండ్‌లైన్ వ్యాపారంపైనా దృష్టి పెట్టామని చెప్పారు. -
టారిఫ్ వార్: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
జియో షాక్‌తో ఎయిర్టెల్, వొడాఫోన్ దిగొచ్చి, అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను వినియోగదారుల ముంగింట్లోకి తెచ్చాయి. వీటి బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. దీనికోసం కేవలం రూ.99తో రీఛార్జ్ చేపించుకుంటే చాలని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. రూ.99తో రీచార్జ్ చేపించుకుంటే నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చని, వాటితో పాటు 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందుబాటులో ఉంచుతామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రేట్ కోల్కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖాండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌లు నెట్వర్క్ పరిధిలోని కాల్స్‌కు అందుబాటులో ఉంటుంది. ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ.119 నుంచి రూ.149కు కల్పిస్తామని కంపెనీ పేర్కొంది. అదేవిధంగా కొత్త కోంబో ఎస్టీవీ ఆఫర్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద రూ.339కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకునేలా అవకాశం కల్పిస్తూ 1జీబీ డేటాను అందుబాటులో ఉంచింది.. 30 రోజుల వాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అపరిమిత 3జీ సర్వీసులను రూ.1099కు అందిస్తోంది. -
ముఖేష్ పోటీగా అనిల్ టెలికాం టారీఫ్‌లు