ముంబై: చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన ఎన్‌ఎస్‌ఈఎల్ సంస్థ బ్యాం క్ ఆకౌంట్లను ముంబై పోలీస్ విభాగానికి చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) మంగళవారం స్తంభింపజేసింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌తో పాటు ఈ స్కా మ్‌తో సంబంధం ఉన్న సంస్థల, వ్యక్తుల మొత్తం 58 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశామని అడిషనల్ పోలీస్ కమిషనర్(ఈవోడబ్ల్యూ) రాజ్యవర్థన్ సిన్హా మంగళవారం వెల్లడించారు. రూ.5,600 కోట్ల చెల్లింపుల స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాతి రోజే బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడం విశేషం. ఎన్‌ఎస్‌ఈఎల్, ప్రమోటర్లు, డిఫాల్టర్లకు చెందిన 54 కార్యాలయాలపై దాడులు చేసినట్లు సిన్హా పేర్కొన్నారు.
సీబీఐ దర్యాప్తు...
కాగా ఎన్‌ఎస్‌ఈఎల్ స్కామ్‌లో డబ్బులు నష్టపోయిన కొందరు ఇన్వెస్టర్లు ముంబైలోని తమ బ్రాంచీలో ఫిర్యాదు చేశారని, ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని సీబీఐ అధికార ప్రతినిధి కంచన్ ప్రసాద్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు. ఈ రోజు రూ.1724.72 కోట్లు ఇన్వెస్టర్లకు చెల్లించాల్సి ఉందని, అయితే ముంబై ఈఓడబ్ల్యూ అధికారులు తమ ఎస్క్రో బ్యాంక్ అకౌంట్‌ను స్తంభింపజేయడంతో చెల్లింపులను జరపలేకపోయామని ఎన్‌ఎస్‌ఈఎల్ పేర్కొంది. అయితే ఎన్‌ఎస్‌ఈఎల్ ఎస్క్రో బ్యాంక్ అకౌంట్‌ను స్తంభింపజేయలేదని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎన్‌ఎస్‌ఈఎల్ బ్యాంక్ ఖాతాల స్తంభన
Published Wed, Oct 2 2013 1:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement